BIKKI NEWS (JAN. 01) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వాడుకునే 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసే అంశాన్ని.2024 – 25 టారిఫ్ ప్రతిపాదనల్లో చేర్చడంపై డిస్కంలు కసరత్తు (6 Guarantees Scheme Free electricity scheme guidelines) పూర్తిచేశాయి.
200 యూనిట్లలోపు వినియోగించే వినియోగదారులు ఎందరు? వారికి ఉచిత విద్యుత్ కోసం అయ్యే వ్యయం ఎంత? అన్న గణాంకాలతో ప్రతి పాదనలు సిద్ధం చేశాయి.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. ఈ పథకాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు ఈఆర్సీ అనుమతిని కోరనున్నాయి.
ఈ పథకాన్ని అమలు చేస్తే, ప్రభుత్వం అదనంగా రూ.3,500 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు చెప్తున్నారు.
ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారు 200 లోపల విద్యుత్ వినియోగిస్తే ఈ పథకం అమలు కానుంది.
కిరాయికి ఉంటున్న కుటుంబాలు కూడా ఈ ఉచిత విద్యుత్ రాయితీ పొందేలా మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు సమాచారం.