AP DSC FREE COACHING – డీఎస్సీకి ఉచిత శిక్షణ, వసతి

BIKKI NEWS (OCT. 18) : FREE DSC COACHING IN ANDHRA PRADESH. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ నెలలో విడుదల కానున్న మెగా డీఎస్సీ కొరకు అభ్యర్థులకు ఉచిత వసతి తో కూడిన శిక్షణ అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖలు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశాయి.

FREE DSC COACHING IN ANDHRA PRADESH

జిల్లా కేంద్రాలలో ఉచిత వసతితో కూడిన డీఎస్సీ శిక్షణను అందించనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, టెట్ మార్కులు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అర్హతలు : ఎస్జిటి శిక్షణ కోసం డీఈడీ మరియు టెట్ అర్హత సాధించి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం డిగ్రీ, బీఈడీ మరియు టెట్ అర్హత సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉండాలి.

ఎస్సీ లకు 3,050, ఎస్టీ లకు 2000 మంది కి శిక్షణ జిల్లాల వారీగా ఇవ్వనున్నారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : అక్టోబర్ 21 – 2024 వరకు

హాల్ టికెట్ల జారీ తేదీ : అక్టోబర్ 22 నుండి 25వ తేదీ వరకు.

స్క్రీనింగ్ టెస్ట్ తేదీ : అక్టోబర్ 27 – 2024

తుది ఫలితాలు విడుదల : అక్టోబర్ 30 – 2024

తరగతులు ప్రారంభం : నవంబర్ 11 – 2024 నుంచి

వెబ్సైట్ : https://jnanabhumi.ap.gov.in/#undefined1

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు