FREE CIVILS COACHING : బీసీ, మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

హైదరాబాద్ (జూన్ 25) : సివిల్ సర్వీసు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు ఓయూలోని బీసీ స్టడీ సర్కిల్లో జూన్ 26 నుంచి జూలై 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని, వివరాల కోసం 040 27077929, 7780359322 నంబర్లలో సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.

◆ మైనార్టీ స్టడీ సర్కిల్ సివిల్స్ శిక్షణ

మైనార్టీ అభ్యర్థుల కోసం మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ – సీసాట్ శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నారు. జూన్ 26 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 13న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.