FORBES RICH LIST 2023 : ప్రపంచ ధనవంతుల జాబితా

హైదరాబాద్ (ఎప్రిల్ – 05) : ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితా 2023 ను ఫోర్బ్స్ (FORBES WORLD RICH PERSONS L IST – 2023) విడుదల చేసింది. ప్రపంచ ధనవంతుడిగా LVMH అధిపతి బెర్నార్డ్ అర్నాల్ట్ 211 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు.

రెండో స్థానంలో ఎలన్ మస్క్ (180 బి. డాలర్ల), మూడో స్థానంలో జెఫ్ బెజోస్ (114 బిలియన్ డాలర్ల) తో ఉన్నారు.

ఆసియా ఖండం, భారత్ లో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు. ప్రపంచ జాబితాలో ముఖేష్ 9వ స్థానంలో, గౌతమ్ అదాని 24వ స్థానంలో నిలిచారు.

ఈసారి జాబితాలో 169 మంది భారతీయ వాణిజ్య వేత్తలు చోటు సంపాందించారు.

◆ టాప్ 10 ప్రపంచ ధనవంతులు

1). బెర్నార్డ్ అర్నాల్ట్
2). ఎలన్ మస్క్
3). జెఫ్ బెజోస్
4). లారీ ఎలిసన్
5). వారెన్ బఫెట్
6). బిల్‌గేట్స్
7). మైఖేల్ బ్లూమ్‌బర్గ్
8). కార్లస్ స్లిమ్ హెల్ & ఫ్యామిలీ
9). ముకేష్ అంబానీ
10). స్టీవ్ బాల్మర్

◆ భారత్ టాప్ 10 ధనవంతులు

1). ముఖేష్ అంబానీ
2). గౌతమ్ అదాని
3). శివ నాడార్
4). సైరస్ పూనావాలా
5). లక్ష్మీ మిట్టల్
6). సావిత్రి జిందాల్
7). దిలీప్ సింఘ్వీ
8). ఆర్.కే దమాని
9). కుమార్ బిర్లా
10) ఉదయ్ కోటక్