BIKKI NEWS (OCT. 11) : FORBES INDIA RICH LIST 2024. ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన భారత కుబేరుల నివేదికలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మొదటి స్థానంలో నిలిచాడు. 119.5 బిలియన్ డాలర్ల సంపదతో దేశీయ కుబేరుల జాబితాలో తొలి స్థానం దక్కించుకున్నారు.
FORBES INDIA RICH LIST 2024
గతేడాది కాలంలో ముకేశ్ సంపాదన 27.5 బిలియన్ డాలర్లు పెరిగి 119.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 13వ స్థానంలో ఉన్నారు.
ఆ తర్వాతి స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. గడిచిన ఏడాదికాలంలో గౌతమ్ అదానీ సంపద 48 బిలియన్ డాలర్లు పెరిగి 116 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.
దేశీయ 100 మంది శ్రీమంతులు సంపద విలువ 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. 2023లో 799 బిలియన్ డాలర్లుగా ఉన్న వీరి సంపద 40 శాతం అధికమై ట్రిలియన్ డాలర్లు అధిగమించింది. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం ఇందుకు కారణమని పేర్కొంది.
ఫోర్బ్స్ 2024 సంవత్సరానికిగాను విడుదల చేసిన జాబితాలోకి కొత్తగా ఇద్దరు తెలుగువాళ్లు ప్రవేశించారు. వీరిలో హెటిరో గ్రూపు ఫౌండర్ బీ పార్థ సారథి రెడ్డి ఉన్నారు. 3.85 బిలియన్ డాలర్ల సంపదతో 81వ స్థానంలో ఉన్నారు. అలాగే బయోలాజిక్ ఈ అధినేత మహిమా దాట్లా 3.3 బిలియన్ డాలర్లతో 100వ స్థానంలో నిలిచారు.
FORBES TOP 10 INDIA RICH PERSONS
1) ముఖేష్ అంబానీ
2) గౌతమ్ అదాని
3) సావిత్రి జిందాల్
4) శివ నాడార్
5) దిలీఫ్ సింఘ్వీ
6) రాధకిషన్ దామాని
7) సునీల్ మిట్టల్
8) కుమార్ బిర్లా
9) సైరన్ పూనావాలా
10) బజాజ్ ఫ్యామిలీ
FORBES TOP 10 TELUGU RICH PERSONS
1) మురళి దివి ఫ్యామిలీ (29)
2) పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి (70)
3) జీఎం రావు (78)
4) బి. పార్దసారధి రెడ్డి (81)
5) పీవీ రాంప్రసాద్ రెడ్డి (82)
6) డాక్టర్ రెడ్డీస్ ఫ్యామిలీ (87)
7) ప్రతాప్ రెడ్డి (94)
8) మహిమ దాట్ల (100)