ఖతార్ (డిసెంబర్ – 20) : ఖతార్ వేదికగా 32 దేశాలు పాల్గొన్న Fifa world cup 2022 ను మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ఫైనల్ లో డిఫెండింగ్ చాంపియన్ ప్రాన్స్ జట్టును ఫెనాల్టీ షూటౌట్ లో 3-3 (4-2) తేడాతో ఓడించి జగజ్జేతగా నిలిచింది. (Fifa world cup 2022 records in telugu)
పోటీపరీక్షల నేపథ్యంలో fifa world cup 2022 సంరంభంలోని వివిధ విశేషాలు నూతన రికార్డుల వివరాలు మీ కోసం
★ రికార్డులు & విశేషాలు :
1) అర్జెంటీనా జట్టుకు ఇది మూడో వరల్డ్ కప్ టైటిల్ (1978, 1986, 2022)
2) వరల్డ్ కప్ ప్రతి దశలో లీగ్, ఫ్రీక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ లలో కనీసం ఒక్క గోల్ చేసిన మొదటి ఆటగాడిగా లియోనల్ మెస్సీ నిలిచాడు.
3) వరల్డ్ కప్ ఫైనల్ లో హ్యాట్రిక్ చేసిన రెండో ఆటగాడిగా ఎంబాపే (ప్రాన్స్) నిలిచాడు. మొదటి ఆటగాడు జెఫ్ హస్ట్ (జర్మనీ – 1966). ఇదే టోర్నీలో పోర్చుగల్ ఆటగాడు రామోస్ కూడా స్విట్జర్లాండ్ పై హ్యాట్రిక్ నమోదు చేశాడు.
4) అత్యధిక గోల్స్ (172) నమోదు అయిన వరల్డ్ కప్ ఇదే. 1998, 2014 లలో 171 గోల్స్ నమోదు అయ్యాయి.
5) ఈ ట్రోపి ని భారత సినిమా నటి దీపికా పదుకునే, స్పెయిన్ మాజీ దిగ్గజ గోల్ కీపర్ కాసిలాస్ తో కలిసి ఆవిష్కరించారు.
6) ప్రపంచ కప్ లలో లియోనల్ మెస్సీ 13 గోల్స్ చేసి వరల్డ్ కప్ లలో అత్యధిక గోల్స్ చేసిన 4వ ఆటగాడిగా నిలిచాడు.
7) ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా మెస్సీ (26 మ్యాచ్ లు) గుర్తింపు పొందాడు.
8) షూటౌట్’ ద్వారా ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టు అర్జెంటీనా. గతంలో బ్రెజిల్ (1994లో), ఇటలీ (2006లో) ఈ ఘనత సాధించాయి. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్ లో ‘షూటౌట్’లలో మ్యాచ్ లు గెలిచిన జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది.
9) ప్రపంచకప్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్ల జాబితాలో అర్జెంటీనా మూడో స్థానానికి చేరుకుంది. బ్రెజిల్ (5 సార్లు) , జర్మనీ (4 సార్లు), ఇటలీ (4 సార్లు) సంయుక్తంగా రెండో స్థానాలలో ఉన్నాయి.
10) ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫెయిర్ ప్లే అవార్డు – ఇంగ్లండ్
11) ఫిఫా వరల్డ్ కప్ 2022 యంగ్ ప్లేయర్ అవార్డు – ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా)
12) గోల్డేన్ బూట్ (ఎక్కువ గోల్స్) అవార్డు – ఎంబాపే (ప్రాన్స్ – 8 గోల్స్)
13) గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్ ) అవార్డు – మెస్సీ (అర్జెంటీనా)
14) గోల్డేన్ గ్లోవ్స్ (బెస్ట్ గోల్ కీపర్) – మార్టీనేజ్ (34 సార్లు గోల్స్నిరోధించాడు) (అర్జెంటీనా)
15) అత్యంత ఖరీదైన అయిన పిఫా వరల్డ్ కప్ ఇదే. ఖతార్ ఫిపా వరల్డ్ కప్ కు ఆతిధ్యం ఇచ్చిన తొలి ముస్లిం దేశం.
16) విజేతకు : 347 కోట్లు
రన్నర్ కు : 248 కోట్లు
మూడో స్థానం : 223 కోట్లు (క్రొయోషియా)
నాలుగో స్థానం : 206 కోట్లు (మొరాకో)
క్వార్టర్స్ లో ఓడిన జట్లకు : 140 కోట్లు
ఫ్రీ క్వార్టర్స్ లో ఓడిన జట్లకు : 107 కోట్లు