Home > SCIENCE AND TECHNOLOGY > FERTILO – ఐవీఎఫ్ కు ప్రత్యామ్నాయం ఫెర్టిలో పద్దతి

FERTILO – ఐవీఎఫ్ కు ప్రత్యామ్నాయం ఫెర్టిలో పద్దతి

BIKKI NEWS (DEC. 20) : Fertilo new technology for fertility. ఫెర్టిలో’ అనే నూతన సంతానోత్పత్తి సాంకేతికతో ప్రపంచంలోనే మొదటిసారి ఓ శిశువు జన్మించింది. అమెరికాలోని గేమ్టో అనే సంస్థ ఈ నూతన సంతానోత్పత్తి సాంకేతికను అభివృద్ధి చేసింది.

Fertilo new technology for fertility

ప్రస్తుతం సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులు ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (IVF) ద్వారా పిల్లలకు జన్మనిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా గేమ్టో సంస్థ ఫెర్టిలో అనే విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ విధానం లో సైడ్ ఎఫెక్ట్ లు చాలా తక్కువ.

ఫెర్టిలో విధానంలో మహిళ నుంచి అండాన్ని సేకరించి ల్యాబ్‌లో పరిపక్వం చెందేలా చేస్తారు. ఇందుకు ఇండ్యూస్డ్‌ ప్లూరిపోటెంట్‌ స్టెమ్‌ సెల్స్‌ (IPSC) నుంచి సేకరించే ఓవరియన్‌ సపోర్ట్‌ సెల్స్‌ (OSC)ను వినియోగిస్తారు. అండం పరిపక్వం చెందిన తర్వాత చేసే మిగతా ప్రక్రియ మొత్తం ఐవీఎఫ్‌లానే ఉంటుంది.

ఫెర్టిలో పద్ధతి ద్వారా గర్భం దాల్చిన ఓ మహిళ.. పెరూ దేశ రాజధాని లిమాలో బిడ్డకు జన్మనిచ్చింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు