Home > 6 GUARANTEE SCHEMES > Farm loan waiver : మూడు విడుతలలో రైతు రుణమాఫీ – సీఎం

Farm loan waiver : మూడు విడుతలలో రైతు రుణమాఫీ – సీఎం

BIKKI NEWS (JULY 17) : Farmer loan waiver in three phases. తెలంగాణ రాష్ట్ర రైతుల పంట రుణ మాఫీ మూడు విడతలలో పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈరోజు కాంగ్రెస్ ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.

Farmer loan waiver in three phases

జులై 18న అనగా రేపు సాయంత్రం 4.00 గంటల వరకు లక్ష లోపు పంట రుణాలు కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. ఇందుకు ఏడు వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.

అలాగే జులై నెలాఖరులోగా రెండో విడతగా 1,50,000 వరకు పంట రుణాలు కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు.

అలాగే మూడో విడతగా ఆగస్టు నెలాఖరులోగా రెండు లక్షల రూపాయల లోపు పంట రుణాలు గల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు.

దీంతో మొత్తం మూడు విడతలలో ఆగస్టు చివరి వరకు రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు