Home > 6 GUARANTEE SCHEMES > Farmer loan – రుణమాఫీకి చర్యలు వేగవంతం

Farmer loan – రుణమాఫీకి చర్యలు వేగవంతం

BIKKI NEWS (JUNE 11) : తెలంగాణ రాష్ట్రంలో రైతుల పంట రుణాలు మాఫీ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేయాలని (farmer loan waiver in telangana)ఆదేశించారు.

రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోగా చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. బ్యాంకర్ల నుంచి పూర్తి స్థాయిలో రైతుల వివరాలను సేకరించి, అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్‌ డేట్‌ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్‌ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాల మాఫీకి సంబంధించిన డేటా, అవసరమైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేసి తీరాలని తేల్చి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.