BIKKI NEWS (SEP. 15) : Farmer loan waiver above 2 lakhs. తెలంగాణ రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించారని . కాంగ్రెస్ మాట ఇస్తే.. తప్పక జరిగితీరుతుందని నిరూపించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Farmer loan waiver above 2 lakhs
వ్యవసాయ రుణం రూ.2లక్షలకు పైగా ఉన్న రైతులు భయపడొద్దు. రూ.2లక్షలకుపైగా ఉన్న మొత్తాన్ని రైతులు బ్యాంకుల్లో చెల్లిస్తే రూ.2లక్షల రుణమాఫీ పూర్తవుతుందని సీఎం తెలిపారు.
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించాం. ఆర్టీసీలో ఇప్పటివరకు 85 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు. మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచి మహిళలకు భారంగా మార్చింది. మేం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు.