Farmer Loan Waiver – అలా చేస్తే రెండు లక్షలు దాటినా రుణాలు కూడా మాఫీ

BIKKI NEWS (AUG. 18) : Farmer Loan waiver above 2 lakhs also. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ రెండు లక్షల దాటిన రుణామం కలిగిన రైతులకు కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ఒక కండిషన్ పెట్టింది. రెండు లక్షలకు పైన ఉన్న రుణాన్ని రైతులు వెంటనే బ్యాంకు లోన్ ఖాతాల్లో జమ చేస్తే రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం జమ చేస్తుందని కీలక ప్రకటన చేసింది.

Farmer Loan waiver above 2 lakhs also

ఉదాహరణకు రెండు లక్షల 50వేల రుణం కలిగిన రైతు 50 వేల రూపాయలను బ్యాంకులో జమ చేస్తే మిగతా రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం చేస్తుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది.

అలాగే అర్హత ఉండి రైతు రుణమాఫీ కాని వారిలో… ఆధార్, పాస్ బుక్, రేషన్ కార్డు తదితర వివరాలు సరిగా లేనివారిని పెండింగ్ ఉన్నాయని తెలిపింది. ఇట్టి రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలను సరి చూసుకుంటే వారి ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ అవుతుందని ప్రకటించింది.

బ్యాంకులు, ఖాతాలల్లో గల సాంకేతిక పొరపాట్ల వల్ల దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన రుణమాఫీ డబ్బులు వెనక్కి వచ్చాయని ఆ తప్పులను సరిచేసి ఇప్పటికే 8000 ఖాతాలలో తిరిగి నిధులు పంపిస్తున్నామని తెలిపింది.

అందువల్ల ఇప్పటికే రెండు లక్షల లోపల రుణాలు ఉండి రుణమాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి అందుకు కారణం తెలుసుకోవాలని సూచించింది.

రైతు రుణమాఫీ కి సంబంధించిన వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోగా పరిశీలించి అర్హులైన వారికి రుణమాఫీ వర్తింప చేస్తామని ప్రకటించింది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు