Home > 6 GUARANTEE SCHEMES > రైతు రుణమాఫీ రెండో విడత కేటాయింపు

రైతు రుణమాఫీ రెండో విడత కేటాయింపు

  • ప్రజా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ దేశచరిత్రలోనే రికార్డు
  • రెండు విడతల్లో రైతుల ఖాతాల్లోకి రూ.12వేల కోట్లు వేశాం..
  • ఆగస్టులోనే మొత్తం రూ.31వేల కోట్ల మాఫీ పూర్తి చేస్తాం
  • తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్న ముఖ్యమంత్రి

BIKKI NEWS (JULY 30) : FARMER LOAN WAIVER 2nd PHASE IN TELANGANA. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు.

FARMER LOAN WAIVER 2nd PHASE IN TELANGANA

తొలి విడతలో రూ.1లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల చేతికి మఖ్యమంత్రి గారు అందజేశారు. ఆగస్టులోనే మూడో విడత చేపట్టి మొత్తం రూ.31వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. స్వల్ప వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేసే రికార్డు తెలంగాణ ప్రజాప్రభుత్వానికే దక్కడం గర్వంగా ఉందని సీఎం అన్నారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల దృష్టితో చూడబోదని, అన్నదాతలు బాగుండాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నాటి నెహ్రూ గారి కాలం నుంచీ నేటి రాహుల్ గాంధీ తరం వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రపొడవునా రైతు పక్షపాతిగానే కొనసాగుతోందని సీఎం గుర్తుచేశారు.

తెలంగాణలో గత ప్రభుత్వం పదేండ్లలో పట్టుమని లక్ష రూపాయాల రుణమాఫీ కూడా సజావుగా చేయలేకపోయిందని, గత పాలకులు రాష్ట్రంపై మోపిన అప్పుల భారాన్ని నిభాయిస్తూనే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.2లక్షల రుణమాఫీని అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి తెలిపారు.

రైతు రుణమాఫీ కోసం 12 రోజుల్లోనే రూ.12వేల కోట్లు సమకూర్చిన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జులై 18న మొదటి విడతలో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో రూ. 6034.96 కోట్లు జమకాగా, నేడు (జులై 30న) రెండవ విడతలో 6,40,223 మంది రైతుల ఖాతాల్లో రూ. 6190.01 కోట్లు జమ అవుతున్నాయి. ఆగస్టులోపే చివరిదైన మూడవ విడతలో 17,75,235 మంది రైతుల ఖాతాల్లో రూ.12224.98 కోట్లు జమ చేయడంతో రూ.2లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తికానుంది.

కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనర్సింహ గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండా సురేఖ గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు