BIKKI NEWS (AUG. 26) : Farmer loan not waiver guidelines. అర్హత ఉండి రేషన్ కార్డు లేకపోవడం మరియు ఇతర కారణాలు మరియు సాంకేతిక కారణాల వలన రైతు రుణమాఫీ కానీ రైతుల వివరాలను గ్రామస్థాయి నుండి సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక యాప్ ను “రైతు భరోసా” పేరుతో ( Rythu Bharosa app) రూపొందించి అధికారులకు అందుబాటులోకి తెచ్చింది. అధికారులు నేరుగా రైతు రుణమాఫీ కానీ కుటుంబాల దగ్గరకు వెళ్లి వారి వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. తద్వారా అర్హత గల వారిని గుర్తించి వారికి రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది.
Farmer loan not waiver guidelines
అలాగే రెండు లక్షలకు మించి రుణాలు తీసుకున్న వారి నుండి రెండు లక్షలకు పైబడిన సొమ్మును బ్యాంకులు కట్టించుకునేలా బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఎవరైతే రెండు లక్షల పైబడిన సొమ్మును బ్యాంకులకు చెల్లిస్తారో వారికి దశల వారీగా రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు తాజాగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రకటించిన విషయం తెలిసిందే
మార్గదర్శకాలు
రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన కుటుంబాల ఇళ్లకు అధికారులు కచ్చితంగా వెళ్లాలి.
ఆ కుటుంబంలో 18 సంవత్సరాలు నిండి, రైతు రుణాలు పొందిన వారి వివరాలను సేకరించి వారి ఫోటోలను తీసుకోవాలి.
వారి రుణ ఖాతా బ్యాంకు వివరాలను, ఆధార్ కార్డు మరియు ఇతర వివరాలను సేకరించాలి.
ఈ వివరాలను పూర్తిగా నింపిన తర్వాత కుటుంబ సభ్యులతో సంతకాలు తీసుకోవలసి ఉంటుంది.
ఈ వివరాలను ధ్రువీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకాన్ని కూడా సేకరించాలి.
తదనంతరం ఈ వివరాలను రైతు భరోసా యాప్ లో నమోదు చేసి చేయాలి.
ఈ వివరాలు ఆధారంగా అర్హులైన రైతులకు త్వరలోనే రైతు రుణమాఫీ చేయనున్నారు.