BIKKI NEWS (APRIL 15) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రైతు రుణమాఫీ పై కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఒకేసారి చేస్తామని (farmer 2 lakhs loan waiver upto august 15th) స్పష్టం చేశారు.
ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేస్తామని, దీనిమీద వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతు రుణమాఫీ చేయలేకపోతున్నామని తెలిపారు.
అలాగే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.