FAKE CERTIFICATES – కానిస్టేబుల్ ఉద్యోగాలకు 60 మంది నకిలీ సర్టిఫికెట్లు

BIKKI NEWS (MARCH 10) : తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో సుమారు 60 మంది హైదరాబాద్ జిల్లా పరిధిలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్య చదివినట్లు తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్లు (fake certificates in telangana constable recruitment) సమర్పించినట్లు స్పెషల్ బ్రాంచి పోలీసుల విచారణలో గుర్తించారు. ఎంపికైన వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్న క్రమంలో.. సుమారు 350 మంది రెండు జిల్లాల్లో (ఇందులో ఒకటి హైదరాబాద్) ప్రాథమిక విద్య చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు ఆధారంగా వారు చదివిన పాఠశాల, ఆ సమయంలోని రిజిస్టర్లు, ఇతర ఆధారాలతో పోల్చిచూడగా 60 మంది నకిలివి ఇచ్చినట్లు వెల్లడైంది. ఎక్కువ పోస్టులు, కొంత తక్కువ పోటీ ఉండే హైదరాబాద్ జిల్లాలోని ఉద్యోగాలు దక్కించుకునేందుకు నిందితులు ఈ పని చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

వారి పేర్లను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB)కి పంపారు. తప్పుడు పత్రాలతో ఉద్యగాలు పొందే ప్రయత్నం చేసినందుకు టీఎస్ఎల్పీఆర్బీ సూచన మేరకు తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన పాఠశాలలు, తీసుకున్న అభ్యర్థులపై కేసులు నమోదు చేసే అవకాశముందన్నారు.

CREDIT _ EENADU