BIKKI NEWS (JAN. 21) : Extra Question in Inter first year English exam. ఇంటర్మీడియట్ పస్టియర్ ఇంగ్లిష్‌లో ఒక ప్రశ్నను అదనంగా చేరుస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి పరీక్షల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది.
Extra Question in Inter first year English exam
ఈ మార్పు రెగ్యులర్ విద్యార్థులకే వర్తిస్తుంది. ఇది వరకు ఫస్టియర్ ఇంగ్లిష్‌లో ప్రశ్నల సంఖ్య 16 ఉండగా, తాజాగా 17కు పెంచారు. ఈ అదనపు ప్రశ్నను సెక్షన్-సీ లో ఇస్తారు. ఈ సెక్షన్‌లో ఇది వరకు ఐదు ప్రశ్నలుండగా, తాజాగా ఆరు ప్రశ్నలిస్తారు. జతపరచండి (మ్యాచ్ ది ఫాలోయింగ్) ప్రశ్నను అదనంగా ఇవ్వనున్నారు.
సవరించిన మాడల్ పేపర్లను అనుసరించాలని బోర్డు సూచించింది. ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉండదని బోర్డు ప్రకటించింది.
విద్యార్థి ఫస్టియర్, సెకండియర్‌లోని అన్ని సబ్జెక్టులకు పరీక్షలు రాయాలనుకుంటే మాత్రం ఇంగ్లిష్ ప్రాక్టికల్ మార్కులను మెరుగుపరుచుకోవచ్చని (ఇంప్రూవ్‌మెంట్) బోర్డు వెల్లడించింది.
ఇంటర్ ఇంగ్లిష్‌లో గతేడాది నుంచి ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టారు. నిరుడు ఫస్టియర్‌లో ప్రవేశపెట్టగా, ఈ ఏడాది సెకండియర్‌లో ప్రవేశపెట్టారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్