రైతు హృదయ దివిటి తెలంగాణ బడ్జెట్ – అస్నాల శ్రీనివాస్

రైతు హృదయ దివిటి తెలంగాణ బడ్జెట్ అస్నాల శ్రీనివాస్

BIKKI NEWS ( JULY 31) : తన కుటుంబ సభ్యులతో శ్రమిస్తూ, సొంత ఉత్పత్తి సాధనాలతో వ్యవసాయం చేసే వ్యక్తే రైతు.వ్యవసాయ కుటుంబంలో పుట్టి నిత్య జీవితంలో వ్యవసాయ రంగ సాధక బాధకాలు అనుభవంలో పరిశీలనంలో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వంతో పాలన సాగిస్తున్నవారు సి యం రేవంత్ రెడ్డి .వ్యవసాయం చేసి పంటలు పండించే ప్రాచుర్యం ఏర్పడటంతో సాంఘిక చరిత్రలో రైతాంగం పుట్టుకొచ్చింది.

మానవ జాతి పరిణామ క్రమంలో రైతాంగం చాలా విశిష్టమైన పాత్ర నిర్వహించింది.పాలకులు ఎవరైనా సరే రైతాంగం పై ఆధారపడి బ్రతికేవారు.సింధూ లోయ నాగరికత నుండే కట్టలు కాల్వలు ద్వారా జరిగిన వ్యవసాయ వికాసంతో నగర నిర్మాణాలు ఏర్పడ్డాయి. అయితే దేశంలో ఎక్కువగా వర్షా భావ ప్రాంతాలలోనే నీళ్ల నిల్వ చేసి పొలాలకు మళ్లించేవారు.మధ్య యుగాల కాలం నుండి భూమి శిస్తు పెరిగినప్పుడు ,భూమి పై హక్కుల కోసం తమ సాంఘిక ఆర్ధిక ప్రతిపత్తి పెంచుకోవడం రైతులు అనేక విజవంతమైన తిరుగుబాట్లు నిర్వహించారు.

రైతు భరోసా పథకం, ఆపదలో ఆదుకోవడానికి రైతు బీమాతో పాటు విప్లవాత్మక రుణమాఫీతో రైతు హృదయ దివిటీ గా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు సీఎం రేవంత్ రెడ్డి. – అస్నాల శ్రీనివాస్.

భారత చరిత్రలో మోప్లా ,సత్నామీ ,మలబార్, తెభాగా, తెలంగాణ సాయుధ పోరాటం ,నక్సలైట్ ఉద్యమం ,ఇటీవల వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేఖంగా జరిగిన ఉద్యమంలో రైతాంగం కేంద్రస్థానంగా జరిగాయి.చారిత్రకంగా రైతాంగం నిర్వహించిన నిర్వహిస్తున్న నిర్వహించనున్న పాత్రను సమగ్రంగా ప్రభుత్వం అర్ధం చేసుకున్నది. క్రీస్తు శకం 200 సంవత్సరం నుండి 20వ దశాబ్దం వరకు రైతుల వ్యవసాయం జీవనం పెద్దగా అనూహ్యమైన మార్పులు లేకుండా కొనసాగింది.మానవ ఇతిహాసంలో మహోదయం యుగోదయం వ్యవసాయం . ఈ నేపధ్యాన్ని అర్ధం చేసుకొని వ్యవసాయ రైతు జీవనంలోలను అనూహ్య వికాసం తీసుకరావడానికి నిబద్ధతతో ప్రభుత్వం పని చేస్తున్నది. .ఓ కర్షక నీ కర్రు కదిలిలిన్నాళ్లు సమస్త నాగరికత వికాసం అన్న కాళోజీ నీ అవాహన చేసుకుని సుస్థిర సుపరిపాలన వైపు గొప్ప ముందడుగు వేస్తున్నారు.

2024-25 బడ్జెట్ లో , రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయం దాని అనుబంధ రంగాలకి పెద్ద పీట వేశారు .అస్నాల శ్రీనివాస్.

తెలంగాణ సామాజిక వ్యవస్థ నిర్మాణం,భౌగోళిక వాతావరణం పై సామాజిక సాంకేతిక జ్ఞానం అవగాహన కలిగి కలిగి ఉన్న రేవంత్ రెడ్డి సారధ్య ప్రభుత్వం విధి విధానాల రూపకల్పన చేసారు. దానికి అనువైన బడ్జెట్ 2024-25 ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 25 జూలై న ప్రవేశపెట్టారు..వ్యవసాయం దాని అనుబంధ రంగాలకి పెద్ద పీట వేశారు .కుటుంబ సభ్యులంతా శ్రమించే చిన్న రైతులు ,కుటుంబమంతా శ్రమిస్తూ ఉన్న చాలినంత భూమిలేని సన్న కారు రైతుల చేతిలో 87% సాగు భూమి ఉంది.వీరికి వ్యవసాయం పండుగ చేయడానికి అనేక ఉద్దీపనలు ఇచ్చారు.

రాజ్యంగ లక్ష్యాలు , ఉద్యమనాటి ప్రజల అకాంక్షలు ,ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి ప్రాతిపదికల ,సూచీల తాత్విక వెలుగులో ప్రజల అరోగ్యకర , సమత్వ,సుస్థిర ప్రగతి ద్యేయంగా బడ్జెట్‌ ను 2,91,191కోట్లతో ప్రవేశ పెట్టారు. – అస్నాల శ్రీనివాస్.

తక్కువ కాలంలో విస్తృతంగా పరిపాలన వికేంద్రికరణ సంస్కరణలు జరిపి సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అజెండాగా సంక్షేమ రాజ్య భావనను తెలంగాణా మాగాణంలో అనుభవం లోకి తెస్తున్నారు . రాజ్యంగ లక్ష్యాలు , ఉద్యమనాటి ప్రజల అకాంక్షలు ,ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి ప్రాతిపదికల ,సూచీల తాత్విక వెలుగులో ప్రజల అరోగ్యకర , సమత్వ,సుస్థిర ప్రగతి ద్యేయంగా పాలనను కొనసాగిస్తున్నారు . ఈ వెలుగు లో 2024-25 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ ను 2,91,191కోట్లతో ప్రవేశ పెట్టారు.

2030 వరకు సుస్థిరాభివృద్ధి (యెస్ డి జి )లక్ష్యాలను చేరుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్దేశించింది . వీటిలో దారిద్య్ర రహితం ,ఆకలి రహితం చక్కటి ఆరోగ్య జీవనం , నాణ్యమైన విద్యని ,లింగ సమానత్వం సాధనలను అగ్రశ్రేణి లక్ష్యాలుగా పేర్కొన్నది. వీటిలో మొదటి రెండు లక్ష్యాల సాధనకు వ్యవసాయ రంగ అభివృ ద్ధి చోదకశక్తి గా కీలక సాధనంగా పని చేస్తుంది . 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక దారిద్య్ర రహిత ఆకలి రహిత తెలంగాణ ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నారు.వ్యవసాయం ,సాగునీటి రంగాలకు .రైతు జీవన భరోసాకు బడ్జెట్‌ లో సింహ భాగం కేటాయిచారు. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు,ప్రార్థన కేంద్రాలు అని ఆచరించిన నెహ్రూ ను స్పూర్తిగా తీసుకున్నారు.ఆహార భద్రతను ,ఆర్ధిక వ్యవస్థ పురోగమనానికి ముడిసరుకు అందించడం తో పాటు పేదరికాన్ని తగ్గించడం లో వ్యవసాయ రంగం ప్రబలంగా పనిచేస్తుంది .ప్రత్యేకంగా గ్రామీణ పేదరికం తగ్గుముఖం పట్టడానికి తోడ్పడుతుంది . దిగువ, మధ్యమ ఆదాయం ఉన్న తెలంగాణా లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన వుద్యోగాల కల్పనకు దారితీస్తుంది. ఈ మార్పులతో ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన కొనుగోలుశక్తి తుల్యత సూచి రోజుకు ఆమెరికా డాలర్ల కంటే 1.90 కంటే ఎక్కువ ఆదాయాన్ని రైతులు , శ్రామికులు పొందుతున్నారు .తలసరి ఆదాయం 3,17,115 రూపాయలకు చేరింది.ఇది జాతీయ సగటు కంటే 86%ఎక్కువ.

ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన కొనుగోలుశక్తి తుల్యత సూచి రోజుకు ఆమెరికా డాలర్ల కంటే 1.90 కంటే ఎక్కువ ఆదాయాన్ని రైతులు , శ్రామికులు పొందుతున్నారు .తలసరి ఆదాయం 3,17,115 రూపాయలకు చేరింది.ఇది జాతీయ సగటు కంటే 86%ఎక్కువ. – అస్నాల శ్రీనివాస్.

వ్యవసాయ రంగం పురోగతి మందగించడం వలన అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తున్నది. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉద్యోగాల కల్పన తక్కువ అవుతున్నది. ఉద్యానవనాలు , పండ్ల తోటలు, పశుసంపద, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. ఆహార పదార్థాల ధరలు పెరుగడం వలన పేద, దిగువ మధ్య తరుగతి ప్రజల వినియోగం తగ్గుతుంది. వినియోగం లేక పన్నుల రూపేణ వచ్చే ఆదాయము తగ్గుతుంది. భూమి పుత్రుడిగా, రైతు బిడ్డగా ,జాతీయ కాంగ్రెస్ సంపద, సంక్షేమ అర్థశాస్త్ర తాత్వికతను ఆవాహణ చేసుకొని రేవంత్ రెడ్డి విన్నూత్న వ్యవసాయ విధానాల రూపకల్పన చేసారు.

ఈ బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు 26831 కోట్లను ప్రతిపాదించాడు. సాగు నీటికి 26885 కోట్లను కేటాయించాడు. మూడో ప్రపంచ దేశాలకు అభివృద్ధికి దిక్సూచీగా తమ ప్రేరణగా నిలిచే రైతు భరోసా పథకం, ఆపదలో ఆదుకోవడానికి రైతు బీమాతో పాటు విప్లవాత్మక రుణమాఫీతో రైతు హృదయ దివిటీ గా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు. ల్యాబ్ టు ల్యాండ్ వెలుగులో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో రైతు వేదికలను అనుసంధానించారు. జీవవైవిధ్యంతో కూడిన పంటల సాగును, విత్తనోత్పత్తి కోసం తెలంగాణాను తీర్చిదిద్దడానికి నూతన హరిత విప్లవాన్ని, పాడి పరిశ్రమల వృద్ది కోసం శ్వేత విప్లవాన్ని, మత్సపరిశ్రమల వృద్ధి కోసం నీలి విప్లవాన్ని, మాంసాహార, ఫౌల్ట్రీ వృద్ధి కోసం పింక్‌, సిల్వర్‌ విప్లవాలను ఆరంభించారు. గత 10 ఏండ్ల పాలన కాలంలో జరిగిన మంచిని,అభివృద్ధిని ,లోపాలను,వైఫల్యాలను సాపేక్ష దృష్టితో సమీక్షించి మరిన్ని జనహిత పథకాల రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‌లో వ్యవసాయం సాగు నీరు శక్తి సంక్షేమ రంగాలు 60%శాతం నిధులను పొందినాయి. సన్న రకపు వరి రకాలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు..

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మూడవది అన్ని వయసులలో అందరికి ఆరోగ్యకరమైన జీవనం. ఈ రంగాన్ని కూడా గణనీయమైన కేటాయింపులను చేస్తూ వస్తున్నది. తెలంగాణాలోని 4797 హెల్త్‌ సెంటర్లను, 876 ప్రైమరీ హెల్త్‌ సెంటర్లను, 107 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను భారత ప్రజారోగ్య ప్రమాణాల సంస్థ నిర్ధేశించిన నిబంధనలను వెలుగులో వర్తమాన సదుపాయాలను కల్పించింది. ఈ బడ్జెట్ లో 11468 కోట్లకు కేటాయించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచి ,5 లక్షల నుండి 10 లక్షలకు పెంచారు.అలాగే గత ప్రభుత్వం స్థాపించిన వైద్య విద్యా సంస్థలలో అండర్‌ గ్రాడ్యుయేట్ ,పోస్ట్‌ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచడం,టీచింగ్ స్టాఫ్ నియామకం చేస్తున్నారు. ఆరోగ్య తెలంగాణతో మానవవనరులను పరిపూర్ణంగా. ఉత్పాదక ,సృజనాత్మక పనులలో ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారు .

సుస్థిరాభివృద్ధి నాలుగవ లక్ష్యం  నాణ్యమైన విద్యను అందించడం కోసం ఈ  బడ్జెట్‌లో దాదాపు 10 శాతం నిధులను కేటాయిస్తూ వస్తున్నారు.  ఈ బడ్జెట్‌లో రూ|| 21389 కోట్ల నిధులను కేటాయించారు.  విద్యకు ప్రాతిపదిక సూచీలైన 7-14 ఏండ్ల మధ్య అక్షరాస్యత లో 90.56 శాతాన్ని, 15 నుంచి 24 ఏండ్ల మధ్య 86.97 శాతం సాధించి, జాతీయ సగటు కంటే ఎక్కువ తెలంగాణ సాధించిన  ప్రగతిని మరింత పురోగమనానికి పాటుపడుతున్నారు. సర్వశిక్షాభియాన్‌ 2023 నివేధికలో పాఠశాల విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌లో తెలంగాణ 99.43 శాతం లక్ష్యాన్ని చేరుకున్నదని తెలియజేసింది.  2014లో బడిమానివేసే వారు ఎక్కువగా ఉన్న తొలి 10 రాష్త్రాలలో ఉన్న తెలంగాణా ఇప్పుడు తక్కువగా బడిమానివేసే వారు ఉన్న రాష్ట్రాల  జాబితాలో చేరింది. 

రాష్ట్ర ప్రభుత్వ విజన్ వెలుగులో తెలంగాణ ఉద్యోగులు ఉత్సాహంతో ,పారదర్శకతతో, జవాబుదారీతనంతో, సమర్ధతతో సుపరిపాలన ఫలాలను ప్రజలకు చేరవేస్తున్నారు. ఉద్యోగ బదిలీలు ,నూతన నియామకాలలో మాటను ప్రభుత్వం నిలుపుకున్నది :- అస్నాల శ్రీనివాస్

సుస్థిరాభివృద్ధి ఐదవ లక్ష్యం లింగ సమానత్వం.ఈ దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం మహిళా జన జీవితాలలో అనూహ్య మార్పు తీసుకవచ్చింది.ఉచిత రవాణాతో శ్రామిక రంగంలో మహిళల వాటా పెరిగింది.  ఉచిత రవాణకు 723 కోట్ల నిధులను ఇచ్చారు. గృహజ్యోతి,సబ్సిడీ సిలెండర్ లతో మహిళా జీవితాలలో వెలుగును నింపింది.వారి శ్రమ,పర్యాటకంతో ,కొనుగోళ్లతో పరోక్షంగా రెవున్యూ పెరగడానికి దోహదం చేసింది.మహిళా ప్రగతి  సమాజ ప్రగతికి కొలమానం అని చెప్పిన అంబేద్కర్ మాటల ఆచరణకు  తెలంగాణ వేదికగా మారింది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు 2736 కోట్ల నిధులను ఇచ్చారు.అంగన్ వాడిలలో ప్రీ ప్రైమరీ తరగతులకు రూపకల్పన చేసారు. తెలంగాణా జనాభా లో వెనుకబడిన తరగతులు , షెడ్యూలు కులాలు ,షెడ్యూలు జాతులు ,మత పరమైన మైనారిటీలు 85% గా వున్నారు. ఈ వర్గాల ఉన్నతి కోసం సామాజిక సమతుల్యత కోసం బడ్జెట్‌ లో 33 వేల కోట్లను ఇచ్చారు.

తెలంగాణ జనాభాలో 36% కు పైగా పట్టణాలలో నివసిస్తున్నారు.తెలంగాణ ప్రజల స్వేద సౌధం,పెట్టుబడుల కేంద్రం ,చారిత్రక నగరి హైద్రాబాద్ అభివృద్ధి కోసం పలు రూపాలలో పలు పథకాలకు 18 వేల కోట్ల నిధులు ఇచ్చారు.విపత్తుల నష్ట నివారణ కోసం హైడ్రా సంస్థను ఏర్పాటు చేసారు.మున్సిపాలిటీల కోసం 15594 కోట్లకు కేటాయించారు.

రాష్ట్ర ప్రభుత్వ విజన్ వెలుగులో తెలంగాణ ఉద్యోగులు ఉత్సాహంతో ,పారదర్శకతతో, జవాబుదారీతనంతో, సమర్ధతతో సుపరిపాలన ఫలాలను ప్రజలకు చేరవేస్తున్నారు. ఉద్యోగ బదిలీలు ,నూతన నియామకాలలో మాటను ప్రభుత్వం నిలుపుకున్నది.అలాగే పెరుగుతున్న వినియోగ ధరల ,టోకు ధరల సూచీ ల నేపథ్యంలో పెండింగ్ డి ఏ లను ,పిఆర్సీ అమలును చేయాల్సిన భాద్యతను త్వరగా నెరవేర్చాలని ఉద్యోగ వర్గాలు కోరుకుంటున్నాయి.

ప్రజా అజెండాయే తన ఆత్మగా భావిస్తూ, తనను నిలబెట్టిన జాతీయోద్యమ ,నవ భారతాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ తాత్వికతను నింపుకుని సమగ్ర సామాజిక అభివృద్ధిని సాధించే దిశగా రేవంత్ రెడ్డి ప్రస్తానం కొనసాగిస్తున్నారు. అస్నాల శ్రీనివాస్

ప్రజా అజెండాయే   తన ఆత్మగా భావిస్తూ, తనను  నిలబెట్టిన జాతీయోద్యమ ,నవ భారతాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ తాత్వికతను నింపుకుని  పరిపాలన మార్పులో తనను ప్రత్యమ్నాయంగా ఎంచుకున్న తెలంగాణకు సుపరిపాలను అందిస్తూ, సమగ్ర సామాజిక అభివృద్ధిని సాధించే దిశగా రేవంత్ రెడ్డి ప్రస్తానం కొనసాగిస్తున్నారు.  తన జీవితాలకు పాలనకు సార్థకత ఉండాలని తపిస్తూ, మధనపడుతున్నారు. తమ  మెదల్లను   పొలంగా మార్చి, దున్ని,  ఎరువు వేసి ప్రజా ఉద్యమ పంటలను,మార్పులకు ప్రభావశీలంగా పని చేసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య ,హరగోపాల్,.కోదండరాం ,ఆకునూరి మురళి వంటి జీవత్వ మేధావులతో,పౌర సమాజ ప్రతినిధులతో  తరచూ సమావేశం అవుతూ వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ చక్కని భవిష్యత్‌ను వాగ్ధానం చేస్తున్నారు. 

పెరుగుతున్న వినియోగ ధరల ,టోకు ధరల సూచీ ల నేపథ్యంలో పెండింగ్ డి ఏ లను ,పిఆర్సీ అమలును చేయాల్సిన భాద్యతను త్వరగా నెరవేర్చాలని ఉద్యోగ వర్గాలు కోరుకుంటున్నాయి. – అస్నాల శ్రీనివాస్

దీర్ఘకాలిక బాగు కోసం బలమైన రాజకీయ సామాజిక గుణాలను ప్రతి పనిలో ప్రతిఫలింప చేస్తున్నారు.  రష్యన్ తత్వవేత్త మిహాయిల్‌ ఫోలోకోవ్  ప్రస్తావించినట్లు, ఒక పాలకుడు తన ప్రాంతపు జీవితాన్ని జీవించాలి, తన ప్రజల బాధలను అనుభవించాలి.  వారి అనందాలతో సంతోషం పొందాలి.  వారి అవసరాలను పంచుకోవాలి.  దీనికి నిలువెత్తు ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు ఉన్నారు.రేవంత్ రెడ్డి తో పాటు సీతక్క,భట్టి విక్రమార్క ,పొన్నం ప్రభాకర్ ,కడియం శ్రీహరి,వేముల వీరేశం,బిడ్జు వంటి అనేకులు అతి సాధారణ.శ్రమను నమ్ముకుని జీవించే కుటుంబ నేపథ్యం కలిగినవారు.చరిత్ర ఇచ్చిన మహావకాశాన్ని సద్వినియోగం కోసం ప్రజల తక్షణ,దీర్ఘకాలిక బాగోగుల కోసం వడి వడిగా అడుగులు వేస్తున్నారు.  తెలంగాణ నుండి అత్యధిక పన్నుల వాటాను చేజిక్కించుకుని ,రాష్ట్రానికి ఇవ్వాల్సిన న్యాయమైన వాటా ఇవ్వని ,ఇటీవల బడ్జెట్ లో ఎలాంటి ఉద్దీపన ఇవ్వని కేంద్ర నిరంకుశ వైఖరిని ఖండిస్తూ నిరసనను పోరాటాన్ని ప్రకటించారు.

భారత ప్రథమ ప్రధాని నెహ్రూ ఆగస్ట్ 15,1947 ఎర్రకోట చారిత్రాత్మక ప్రసంగం “ట్రిస్ట్ విత్ డెస్టినీ “లో దేశానికి, సమాజానికి సేవ చేయడమంటే “పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అవకాశాలలో అసమానతను అంతం చేయడమే”అని చెప్పారు. – అస్నాల శ్రీనివాస్

భారత ప్రథమ ప్రధాని నెహ్రూ ఆగస్ట్ 15,1947 ఎర్రకోట చారిత్రాత్మక ప్రసంగం “ట్రిస్ట్ విత్ డెస్టినీ “లో దేశానికి,సమాజానికి సేవ చేయడమంటే “పేదరికం, అజ్ఞానం,అనారోగ్యం,అవకాశాలలో అసమానతను అంతం చేయడమే”అని చెప్పారు.ఈ నినాదం వెలుగులో  తెలంగాణ ప్రాధాన్యతలను  సుస్థిరాభివృద్ది లక్ష్యాలను అనుసంధానం చేస్తూ, విజన్‌ డాక్యూమెంట్‌ని రూపొందించుకొని, నిర్ధేశించిన గడువు కంటే ముందుగానే మానవాభివృద్ధి సూచికలలో అగ్రశేణ్రిలో చేరే దిశగా తెలంగాణా పురోగమించడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది..

అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
, ప్రముఖ విద్యావేత్త, వ్యాసకర్త