AMBEDKAR : అంబేద్కర్ జీవన గమనంపై మునిస్వామి వ్యాసం

అస్పృశ్యుల అశ్రు జలమున్
హస్తంబుచేత తుడవంగ అవతరించేనా
స్వస్థంబు నిచ్చు సురపతీ
మస్తకంబందుండే అంబేద్కర్ నిత్యం గదరా…

BIKKI NEWS : నిన్నునువ్వు విశ్వసించు , ధర్మం మన పక్షాన ఉండగా యుద్ధంలో ఓటమి అన్నది కల్ల , మన పోరాటం భౌతిక పరమైనదో , సామాజిక పర మైనదో కాదు పూర్తిగా ఆత్మ ఔనత్యమైనది, సంపద కోసం, అధికారం కోసం మనం పోరాడడం లేదు ,స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం , మానవ వ్యక్తిత్వ పునః సంస్కరణ కోసం పోరాడుతున్నాం, ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా ఆజన్మాంతం తన లక్ష్యాన్ని వీడలేదు . ఈ పోరాటమే తన జీవిత గమ్యం అని కంకణబద్ధులైనారు, అంటరానితనాన్ని తుది ముట్టించడంలో శిఖర సమానo అయ్యాడు, అసమాన విద్యావంతుడు , దళిత చైతన్య మూర్తి , రాజనీతి శాస్త్ర కోవిదుడు, న్యాయశాస్త్ర దిట్ట, పరిపాలనాదక్షుడు, రచనా దురంధరుడు, భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞావంతుడు, కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి

అంటరాని వాడని సమాజం వెలేసిన వ్యక్తి, అట్టడుగు వర్గాల ఆయుధం, పీడిత వర్గాల పెన్నిధి , ఒక తత్వ శాస్త్ర వేత్త, ఒక సంఘసంస్కర్త, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, న్యాయవాది, ధర్మశాస్త్ర పండితుడు, పునరుద్ధరణ కర్త, ఎన్నో అసమానతలు వర్ణ వివక్ష నిర్మూలన కొరకు జీవితమంతా పోరాడిన ఒక మహాశక్తి, దళితుల భవిష్యత్తుకు బాటలు వేసిన క్రాంతి కిరణం, అనగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన,వేగు చుక్క, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన మహనీయుడు, ఒక ఆర్థికవేత్త, బహుజనుల విధిరాతను తిరగరాసిన మరో విధాత, సమస్త భారతానికి దిక్సూచిగా భవిష్యత్తు ప్రయాణాన్ని సూచించిన కలియుగ నేత , ఉత్తమోత్తమ భారతరత్న… అతడే బాబాసాహెబ్ భీంరావ్ రాంజీ అంబేద్కర్

◆ బాల్యం, విద్యాభ్యాసం

అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్స్ ఐనా మెహొమ్ ఇప్పటి మధ్యప్రదేశ్ లో రాంజీ సత్పాల్ & భీమాబాయి దంపతులకు జన్మించిన 14 వ చివరి సంతానం.. సొంత ఊరు మరాఠీ గడ్డ లోని రత్నగిరి జిల్లాలోని (అనువాడ) అంబావాడే పట్టణం వీరిది మెహర్ కులం , సమాజం వీరిని అస్పృశ్యులుగా చిత్రీకరించింది .. చిన్నప్పటి నుండే అంబేద్కర్ పురాణాలను ఇతిహాసాలను తదితర గొప్ప గ్రంథాలను చదివేవారు, గొప్ప ఆధ్యాత్మిక పాటలను గానం చేసేవారు, ఆనాటి అసమానతలు సాంఘిక దురాచారాలు అప్పుడే అంబేద్కర్ అర్థమయ్యాయి.. చిన్నప్పుడు బరిలో అగ్రకులాల విద్యార్థుల పక్కన సమానంగా కూర్చోవడానికి వీలు లేదు గది బయట కూర్చోని పాఠాలు వినేవారు, చదువులో బాగా చురుగ్గా ఉండేవారు, బడిలో దాహం వేస్తే అగ్రకులాలవారు కొళాయి తిప్పితేనే నీరు త్రాగాలి, పక్కన ఎవరు లేకపోతే దాహంతో అల్లా రావాల్సింది తప్ప కుళాయి ముట్టుకోవడానికి అర్హత లేదు, ఇలాంటి అవమానాలు అంబేద్కర్ హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి,

◆ ఉద్యమ స్ఫూర్తికి నాంది

ఒకసారి వేసవి సెలవులలో అంబేద్కర్ అన్నగారు వారి మేనమామ కొడుకులు కలిసి ఇ వారి మేనమామ ఊరైన గోరేగావ్ బయలుదేరారు.. కొన్ని కారణాల వల్ల వారి మేనమామ రైల్వే స్టేషన్ దగ్గరికి రాలేక పోయారు. అంబేద్కర్ గుర్రపు బండిని మాట్లాడుకొని గోరేగావ్ బయలుదేరారు . మార్గమధ్యంలో ఆ బండి వాడు వారు అంటరాని వారు అని తెలుసుకుని వెంటనే బండి దిగమని తగు పడ్డాడు.. అసలే ఎండా చిన్నపిల్లలు సగం దూరం వచ్చేసాం మమ్మలను ఊరికే చేర్చమని బతిమిలాడినా ససేమిరా అన్నాడు. చివరకు రెండింతల డబ్బు & అంబేద్కర్ అన్న బండి తోలడం, బండి యజమాని బండి కి దూరంగా వెనుక నడవడం శరతుతో ఒప్పుకొని అర్ధరాత్రి ఊరు చేరారు, అక్కడ అ ఒక వీధి కుళాయి దగ్గర అ నీటిని తాగుతున్నప్పుడు అంటరాని వాడని అక్కడివారు అంబేద్కర్ పై దాడి చేసి గెంటి వేశారు.. అలాంటి అసమానతలు చూసి అంబేద్కర్ గుండె రగిలిపోయింది, అదే అతని మిత్రులు లో నిప్పు రాజేసినది, యుగాల తరబడి అట్టడుగు వర్గాల ప్రజలను అవమానిస్తున్నారని తెలుసుకొని రక్తం మరిగి పోయింది.. ఈ అసమానతలను కూకటివేళ్లతో పెకలించి వేయాలని నిర్ణయించుకున్నారు, అనగారిన వర్గాల తరఫున ఒక విప్లవ వీరుడు అప్పుడే పుట్టాడు

ఉన్నత విద్యాభ్యాసం

1907లో బొంబాయిలో తన మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. తన పదహారవ యేట అంబేద్కర్ కు వివాహం అయింది.. పై చదువులు చదవాలని తపన తో బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బిఏ లో పట్టా పొందాడు, వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా లభించింది, అంబేద్కర్ ఉద్యోగంలో చేరకుండా ఉన్నత చదువులు చదవాలని మహారాజు గారి తో చెప్పడం ద్వారా రాజుగారు ఒప్పుకుని చదువు పూర్తయిన తర్వాత పది సంవత్సరాలు సంస్థానంలో పనిచేయాలని షరతుతో విదేశీ ఉన్నతవిద్య చదవడానికి ఆర్థిక సహాయం చేశాడు.. అప్పుడు 1913లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు, 1915లో MA,1916 లో PhD డిగ్రీని సంపాదించారు 1917లో డాక్టర్ అంబేద్కర్ గా స్వదేశానికి తిరిగి వచ్చాడు అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలే. బరోడా రాజా వారు పెట్టిన షరతు ప్రకారం మిలిటరీ కార్యదర్శిగా సంస్థానం లో చేరాడు, అక్కడ కూడా కుల వివక్ష ఉండేది, తన కింది ఉద్యోగులు దస్త్రాలను చేతికి అందించకుండా బల్లపై విసిరేసి అవమానించేవారు

ఆ సమయంలో కొల్హాపూర్ మహారాజు సాహు గారు సాంఘిక దురాచారాలపై పోరాడుతున్నాడు అతని సహాయంతో అంబేద్కర్ మూక నాయక్ అనే పక్ష పత్రిక నడప సాగాడు.. కొలంబియా, బరే డ్ల విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ను, లండన్ విశ్వవిద్యాలయం నుంచి డిఎస్సీ పట్టాను పొందారు. మహద్ లో దళితుల మహా సభ నిర్వహించి ఆ ఊరి చెరువులో దళితులు కూడా నీరు త్రాగే విధంగా సంస్కరణ తెచ్చాడు.. అంబేద్కర్ అదే సంవత్సరం బహిష్కృత భారతీ అనే పక్ష పత్రిక ప్రారంభించాడు.. ఆ పత్రికలో తన చిన్నతనం నుండి ఎదుర్కొన్న కుల వివక్ష అవమానాలు ప్రస్తుతం ఉన్న సాంఘిక అసమానతలు అనేక సంఘటనలు రాసేవారు , అంబేద్కర్ బాలగంగాధర్ తిలక్ ను నీవు దళితుడవై పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అనే వాడివి కాదు అంటరానితనం నిర్మూలన నా జన్మ హక్కు అనే వాడివి అని నిర్భయంగా రాసిన ధైర్యశాలి , ఈ అసమానత ఇలాగే కొనసాగితే అంటరానివారికి ప్రత్యేక దేశం కావాలని ఉద్యమిస్తారు అని ఉటంకించాడు.. అంటరాని వారికి ఆలయ ప్రవేశం అనే ఉద్యమాన్ని నడిపాడు,అనేక సభలలో కులవివక్ష మీద ప్రసంగాలు చేసేవారు . అంబేద్కర్ ఎప్పుడు ఖాళీగా ఉండే వారు కాదు, న్యాయవాదిగా, వాణిజ్య ఆర్థిక సలహాదారుగా అకౌంటెంట్ గా పని చేస్తూ ఉండేవారు.. బొంబాయి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గా, ముంబై హైకోర్టు జడ్జిగా వచ్చిన అవకాశాలను తృణప్రాయంగా వదిలేశాడు

స్వాతంత్రోద్యమ ప్రవేశం

అప్పుడప్పుడే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రాజకీయంగా దగ్గరవ సాగాడు. కొన్ని సందర్భాలలో గాంధీతో వర్ణ ,ఆర్థిక అసమానతలపై విభేదించే వారు.. లండన్ లో జరిగిన మూడు బ్రిటిష్ రౌండ్ టేబుల్ సమావేశాలకు పూణే ఒడంబడిక తో మళ్లీ దళితజాతుల ప్రత్యేక నియోజకవర్గాల గురించి కొన్ని షరతులతో ఏకీభావించారు.. అంతటితో ఆగకుండా, దళిత జాతుల కోసం కొన్ని పార్టీలు స్థాపించి దళితులను ఏకం చేయడం లో నిమగ్నమయ్యారు.. అప్పుడే క్విట్ ఇండియా ఉద్యమం, దేశవిభజన తో కూడిన స్వాతంత్రం వచ్చాయి. అప్పుడే రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా విశేషంగా శ్రమించి భారత రాజ్యాంగం నిర్మించడం అంబేద్కర్ జీవితంలో ఒక మహాద్భుత ఘట్టం. కేంద్ర మండలి లో మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా పదవి అలంకరించారు. తన 56వ యేట ఒక బ్రాహ్మణ అమ్మాయి సవితా దేవిని ద్వితియ వివాహం చేసుకున్నారు, మొదటి భార్య 1935లో మరణించారు. అలాగే 1956 వ సంవత్సరంలో అక్టోబర్ 14న నాగపూర్ లో అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించారు. బౌద్ధం హిందూమతంలో భాగమని , ఈ దేశ చరిత్ర సంస్కృతి నా మార్పిడి వల్ల దెబ్బతినకుండా చూస్తాను అని చెప్పారు.. నిరంతర కృషితో సాగిన అంబేద్కర్ జీవన పోరాటం ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది, ఎన్నో సంఘసంస్కరణలు ఎన్నో రచనలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు వ్యవస్థలు అంబేద్కర్ ను వేయినోల్ల కొనియాడారు.. ఐక్యరాజ్య సమితి సైతం అంబేద్కర్ వర్ధంతి కి నివాళులు అర్పించే స్థాయికి ఎదిగారు విశ్వ జ్ఞానిగా పేరుపొందారు.. ఈ విషయాలు కేవలం మచ్చుకు మాత్రమే మహత్తర చరిత్ర ఇంకా చాలా ఉన్నది.. ఇంతటి కీర్తిప్రతిష్టలు గడించిన మహా మేధావి 1956 డిసెంబర్ 6న తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు

భారతదేశ గతిని, స్థితిని మార్చిన యోధుడు, కుల వ్యవస్థను రూపుమాపితే గానీ దేశం అభివృద్ధి చెందిందని నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తి . సామాజిక సంస్కరణలలో ఈయనది ఒక చెరగని ముద్ర, కోట్లాది పీడిత వర్గాల ప్రజలకు ఈయన ఒక రగిలే నిప్పు కణం, జీవితమంతా రాజీలేని పోరాటమే , ఆ పోరాటం తన కోసం కాదు తన జాతి జనుల స్వేచ్ఛా జీవితం కోసం, సకల రుగ్మతలకు మూలమైన కుల వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించడం కోసం తన జీవితం మొత్తం శ్రమించాడు.. అంబేద్కర్ చేసిన అహర్నిశల పోరాటానికి భారత ప్రభుత్వం 1990 లో అతనికి భారతరత్న అవార్డును అందించారు. భారతదేశం ఉన్నంతకాలం ఆయన చేసిన సంస్కరణలు, రగిలించిన స్ఫూర్తి ఎప్పుడు జీవం పోసుకుని ఉంటాయి దైవ సమానుడైన అంబేద్కర్ గారిని స్మరించుకుందాం! తరించి పోదాం
జై హింద్! జై భీం!!

మునిస్వామి
అధ్యక్షులు, ఆర్జేడీ అపాయింటెడ్ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా