BIKKI NEWS (JUNE 20) : WEF Energy Transition Index 2024. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 సంబంధించి ఇంధన పరివర్తన సూచి నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ 63వ స్థానంలో నిలిచింది.
ప్రపంచ ఇంధన పరివర్తన సూచి 2024 నివేదికలో మొదటి స్థానంలో స్వీడన్ నిలిచింది. చివరి స్థానంలో కాంగో నిలిచింది. ఐరోపా ఖండ దేశాలు ఈ సూచీ లో మంచి ఫలితాలు చూపాయి.
భారత్ స్వచ్ఛ ఇంధనం కొరకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ అభినందించింది. భారత్ 2022 లో 73వ స్థానం, 2023లో 69వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
120 దేశాలతో కూడిన ఈ జాబితాను ఆ దేశాల యొక్క శక్తి వనరుల లభ్యత, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి ప్రోత్సాహం ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు.
ఇంధన వాటా, భద్రత, స్థిరత్వంలో భారత గణనీయమైన వృద్ధి సాధించిందని వరల్డ్ ఎకానమిక్ ఫోరం తెలిపింది.
ప్రపంచ జనాభాలో మూడవ వంతు జనాభా భారత చైనా దేశంలో ఉండడంతో హరితహిందన ఉత్పత్తిలో ఈ రెండు దేశాలు కీలక పాత్ర పోషించాలని వరల్డ్ సూచించింది.
బ్రెజిల్ , చైనా మరియు భారతదేశం వంటి ప్రధాన పెరుగుతున్న డిమాండ్ కేంద్రాలు ఇటీవలి సంవత్సరాలలో ETIపై బలమైన మెరుగుదలలు చూపినట్లు వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ తెలిపింది..
Energy Transition Index 2024 టాప్ 10 దేశాలు
1) స్వీడన్
2) డెన్మార్క్
3) పిన్లాండ్
4) స్విట్జర్లాండ్
5) ప్రాన్స్
6) నార్వే
7) ఐస్‌ల్యాండ్
8) ఆస్ట్రియా
9) ఎస్టోనియా
10) నెదర్లాండ్స్
ఇంధన పరివర్తన సూచీ చివరి 5 దేశాలు
120) కాంగో
119) యొమెన్
118) టాంజానియా
117) మొజాంబిక్
116) మంగోలియా
115) బోట్స్‌వానా
ఇంధన పరివర్తన సూచీ భారత చుట్టూ పక్కల దేశాల
17) చైనా
63) ఇండియా
69) శ్రీలంక
100) నేపాల్
109) బంగ్లాదేశ్
113) పాకిస్థాన్