Electricity Bill – కరెంటు బిల్లు ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా చెల్లించవచ్చు

BIKKI NEWS (AUG. 18) : electricity bills now pay with google pay and Phone pay. కరెంట్‌ బిల్లులు ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించారు. ఈ రెండు థర్డ్‌ పార్టీ ఏజెన్సీలు కావడం, ఇవి భారత్‌ బిల్‌ పేలో చేరకపోవడంతో ఆర్‌బీఐ ఆదేశాలను అనుసరించి జూలై 1 నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కరెంట్‌ బిల్లులు చెల్లించడాన్ని రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలు నిలిపివేసిన విషయం తెలిసిందే.

electricity bills now pay with google pay and Phone pay

ఈ రెండు కూడా భారత్‌ బిల్‌పే లిమిటెడ్‌లో చేరడంతో తాజాగా టీజీఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ వినియోగదారులు ఇక నుంచి ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా విద్యుత్తు బిల్లులను చెల్లించే వెసులుబాటు కలిగింది.

తెలంగాణతోపాటు, ఏపీ విద్యుత్తు సంస్థల వినియోగదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ఎన్‌పీసీఐ భారత్‌ బిల్‌పే లిమిటెడ్‌ సీఈవో నూపూర్‌ చతుర్వేది తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు