EMRS JOBS : ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 4,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్ (జూన్ – 29) : కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 4,062 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి EMRS STAFF SELECTON EXAM 2023కు (ESSE – 2023) నోటిఫికేషన్ జారీ చేసింది.

◆ ఖాళీల వివరాలు :

ప్రిన్సిపల్-303

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)-2266

అకౌంటెంట్-361

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) : 759

ల్యాబ్ అటెండెంట్: 373

విభాగాలు: మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ,
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితరాలు.

◆ అర్హతలు :

ప్రిన్సిపాల్ :- పీజీ, బీఈడీ (50 సం. వరకు)

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) :- బీఈడీ & సంబంధించిన సబ్జెక్టులో పీజీ (40 సం. వరకు)

అకౌంటెంట్ :- డిగ్రీ (30 సం. వరకు)

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) :- సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత (30 సం. వరకు)

ల్యాబ్ అటెండెంట్ :- 10/ 12వ తరగతి (30 సం. వరకు)

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు : ప్రిన్సిపాల్ – 2,000/-, PGT – 1,500/-, Non Teaching – 1,000/-

దరఖాస్తు గడువు : జూలై – 31 – 2023 వరకు

ఎంపిక విధానం : OMR BASED TEST & INTERVIEW ద్వారా.

◆ వెబ్సైట్ : https://emrs.tribal.gov.in/