హైదరాబాద్ (జూన్ – 30) : కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను దశాబ్ద కాలం పాటు పొంది ఇప్పుడు రెగ్యులర్ నియామకాల పేరుతో వాని తొలగించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో సైట్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్లుగా 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ ను ఆదేశించింది
సర్వీస్ కంబద్దీకరణ కోరుతూ పిటీషనర్లు వినతిపత్రం సమర్పించాలని…. దీన్ని పరిశీలించి మూడు నెలల్లో కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది ఈ సందర్భంగా వయోపరిమితి మినహాయింపు అంశాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది. అంతవరకు వారిని సర్వీస్ నుంచి తొలగించరాదని, వారి స్థానంలో ఇతరులను నియమించరాదని తేల్చి చెప్పింది.
2012 నుంచి తమ సేవలను పొంది క్రమబద్ధీకరించకుండా కొత్తవారితో నియామకాలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ ఇవి వేణుగోపాల్ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. వివిధ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ ఒప్పంద పద్ధతిలో దీర్ఘకాలం సేవలందించిన వారిని తగిన అర్హతలు ఉంటే రెగ్యులర్ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు క్రమబద్ధీకరించాల్సిందేనని తెలిపారు.
- Open BEd – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ బీఈడీ అడ్మిషన్లు
- SSC JOB CALENDAR 2025 – 26 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ కేలండర్
- GENERAL HOLIDAYS 2025 – 2025 సాదరణ సెలవులు ఇవే
- Group 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు – సుప్రీంకోర్టు
- VTG CET 2025 – 18న గురుకుల ఐదో తరగతి ప్రవేశ నోటిఫికేషన్