BIKKI NEWS (MAY 15) : eapcet 2025 counselling dates. రాష్ట్ర అగ్రికల్చర్ (PJTGAU), హర్టీకల్చర్ (SKLTGHU), వెటర్నరీ PVNRTVU) విశ్వవిద్యాలయాలలలో మరియు వాటి పరిధిలోని కళాశాలల్లో 2025 సంవత్సరం ఆడ్మిషన్లకు మే 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
eapcet 2025 counselling dates.
ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన పదేళ్ల గడువు పూర్తవడంతో ఏపీ విద్యార్థులకు 15 శాతం కోటా రద్దయి ఈ కళాశాలల్లో రాష్ట్ర కోటాలోని సీట్లన్నీ తెలంగాణ స్థానికులతోనే భర్తీ కానున్నాయి.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినందున ఆ మేరకు సీట్ల కేటాయింపులు జరగనున్నాయి.
దివ్యాంగుల రిజర్వేషన్లు 3 నుంచి 5 శాతానికి పెరిగినందున దానిని ఈ ప్రవేశాల్లో అమలు చేయనున్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం తమ పరిధిలోని కోర్సుల సమాచారాన్ని బుధవారం విడుదల చేసింది.
1,700కి పైగా సీట్ల భర్తీ
మొత్తం మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో 1,700కి పైగా సీట్లు అందుబాటులో కలవు. మొత్తంగా 80 శాతం సీట్లలో తెలంగాణ విద్యార్థులకు అవకాశం వస్తుంది. మిగిలిన 20 శాతం సీట్లను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) కోటా కింద, భారత పశు వైద్యమండలి (వీసీఐ) కోటా కింద అఖిలభారత స్థాయిలో భర్తీ చేస్తారు.
వ్యవసాయ కూలీల పిల్లలకు 15% రిజర్వేషన్లు
మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో రైతు కుటుంబాల పిల్లలకు 40 శాతం సీట్ల రిజర్వేషన్ ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈసారి ఆ కోటాను 25 శాతానికి తగ్గించి, 15 శాతాన్ని భూమిలేని వ్యవసాయ కూలీల పిల్లలకు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాలు అంగీకరించలేదు. మొత్తం 40 శాతం రిజర్వేషన్లను రైతు కుటుంబాల విద్యార్థులకే ఇస్తామని అవి స్పష్టం చేశాయి. దీంతో కూలీల పిల్లలకు 15 శాతం రిజర్వేషన్లు ఒక్క వ్యవసాయ కళాశాలల్లో మాత్రమే అమలు చేయనున్నారు.
వెబ్సైట్ : https://www.pjtsau.edu.in/index.html
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్