BIKKI NEWS (JUNE 13) : Dy. Secretary Chitram Yadagiri visited GJC Dharmakancha. ప్రభుత్వ ఇంటర్ విద్యలో త్వరలో విప్లవాత్మక మార్పులను ప్రవేశ పెట్టేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ చిత్రం యాదగిరి అన్నారు.
Dy. Secretary Chitram Yadagiri visited GJC Dharmakancha
ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకంచ, జనగామ నందు ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల బృందం నిర్వహిస్తున్న అడ్మిషన్ ప్రక్రియను శుక్రవారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
అధ్యాపకులు విద్యార్థులకు అనుకూలంగా భోధన పద్ధతులు పాటిస్తూ విద్యార్థులలో దాగియున్న నైపుణ్యలను వెలికితీయాలన్నారు. ప్రతి జూనియర్ కళాశాలలోనూ జూనియర్ లెక్చరర్ల వారీగా అడ్మిషన్ల లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని పూర్తిచేయాలని సూచించారు. దీనికిగాను అధ్యాపకులు ముందుగానే 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని, తదనుగుణంగా బోధించాలని సూచించారు.
కళాశాలల్లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, క్రీడలకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని అన్నారు. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్యను పెంచాలని నాణ్యమైన బోధనను అందించాలని అధ్యాపకులకు సూచించారు.
అనంతరం జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ప్రవేశాల కోసం రూపొందించిన ప్రచార కరపత్రాలను ప్రిన్సిపాల్ మరియు కళాశాల సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి మాట్లాడుతూ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యగారి మరియు బోర్డు పరిశీలకుల ఆదేశాలు పాటిస్తూ ఈ సంవత్సరం అడ్మిషన్స్ పెంచడంతోపాటు విద్యార్థులలో అన్ని రకాలుగా దాగిన నైపుణ్యాలను వెలికి తీయాలని అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల బృందం మరియు కళాశాల ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్