INTERMEDIATE : పాస్ సర్టిఫికెట్ లు పోయిన వారికి డూప్లికేట్ సర్టిఫికెట్ లు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 20) : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో ఇంటర్ పూర్తి చేసి వివిధ కారణాల వల్ల సర్టిఫికెట్ లను పోగొట్టుకున్న అభ్యర్థులు డూప్లికేట్/ ట్రిప్లికేట్ పాస్ సర్టిఫికెట్ ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డ్ కల్పించింది.

డూప్లికేట్ సర్టిఫికెట్ కు 1,000/ రూపాయలు, ట్రిప్లికేట్ సర్టిఫికెట్ కు అయితే 2,000/- రూపాయలను ఆన్లైన్ ద్వారా చెల్లించి పొందవచ్చు.

అభ్యర్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం, పది రూపాయల విలువ చేసే స్టాంప్ పేపర్ తో కూడిన అఫిడవిట్ ను మరియు ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్ సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ నుండి తీసుకుని ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం ద్వారా అభ్యర్థులు సర్టిఫికెట్లను పొందవచ్చు. దీనికోసం ఎలాంటి పోలీస్ స్టేషన్ నుండి ఎఫ్ఐఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు.

TSBIE CIRCULAR

వెబ్సైట్ : https://tsbie.cgg.gov.in/studentServices.do