BIKKI NEWS (SEP. 14) : DSC TET MARKS UPLOADING ISSUES. తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ దరఖాస్తులో టెట్ మార్కుల సవరణలో… కొత్త మార్కులు ఆప్‌లోడ్ చేసినా ఇంకా పాత మార్కులే చూపిస్తున్నట్లు కొందరు అభ్యర్థులు పిర్యాదు చేస్తున్నారు.
DSC TET MARKS UPLOADING ISSUES.
అలాగే కొందరు అభ్యర్థులు సీ టెట్ మార్కులు అప్‌లోడ్ చేయగా, ఇప్పుడవి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓ అభ్యర్థి ఈ నెల 2న అప్లికేషన్ అప్‌లోడ్ చేయగా, 129 మార్కులు చూపించింది. మూడు రోజుల క్రితం చూడగా పాత మార్కులు 91 మార్కులే చూపిస్తున్నది.
మరో అభ్యర్థి ఎడిట్ ఆప్షన్‌లోకి వెళితే సబ్జెక్టు గణితం, సైన్స్ అని చూపిస్తున్నది. వాస్తవానికి సదరు అభ్యర్థి సోషల్ స్టడీస్‌కు ఎగ్జామ్ రాశాడు.
ఇక హాల్‌టికెట్ నెంబర్ ఎడిట్ చేసుకునే అవకాశమిచ్చినా వెబ్‌సైట్‌లో ఆ అవకాశమే లేకుండా పోయింది. ఇవేకాకుండా అనేక తప్పిదాలు చోటుచేసుకున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
2017 డిసెంబర్‌లో టెట్ పరీక్ష జరగలేదు. జూలై 23న జరిగింది. ఆగస్టు 4న ఫలితాలిచ్చారు. కానిప్పుడు ఎడిట్ ఆప్షన్‌లో మాత్రం 2017 డిసెంబర్ 1 అని చూపిస్తున్నది. అసలు 2017లో టెట్ జరిగిందే ఒక్కసారే. ఇలా అనేక తప్పిదాలున్నాయని, సవరించాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.