DSC NOTIFICATION : కీలక నిబంధనలు ఇవే

హైదరాబాద్ (సెప్టెంబర్ – 09) : 5, 089 టీచర్ ఉద్యోగాల నియామకా కోసం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ DSC NOTIFICATION 2023 RECRUITMENT RULES ను విడుదల చేసిన విషయం తెలిసిందే

ప్రత్యక్ష ఉపాధ్యాయ నియామకాలు, ఎంపిక విధానం, విద్యార్హతలు తదితర అంశాలపై ప్రభుత్వం సెప్టెంబర్ 5వ తేదీనే జీఓ 25 జారీ చేసింది. అందులో పేర్కొన్న ముఖ్యాంశాలు

ఈసారి సాధారణ ఉపాధ్యాయ పోస్టులకు స్పెషల్ డీఈడీ, స్పెషల్ బీఈడీ పూర్తి చేసి, టెట్ అర్హత సాధించిన వారికి పోటీపడే అవకాశమిచ్చారు. అయితే… ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత వారు ఆరు నెలలు ప్రత్యేక కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎస్జీటీ కొలువులకు డీఈడీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.

పరీక్షలో ప్రశ్నలు తెలుగు-ఆంగ్లం, ఉర్దూ- ఆంగ్లంలో ఉంటాయి. 160 ప్రశ్నలు… 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. టెట్ లో సాధించిన మార్కులకు 20% వెయిటేజీ ఇచ్చారు. రెండింటినీ కలిపి తుది ర్యాంకు నిర్ణయిస్తారు.

రోజుకు రెండు విడతల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. తొలుత ఎస్జీటీ అభ్యర్థులకు ఉంటాయి.

ఈసారి 1-7 తరగతుల విద్యాభ్యాసం ఆధారంగా స్థానిక, స్థానికేతర అభ్యర్థిగా నిర్ణయిస్తారు. 95% ఖాళీలను స్థానికులతో, 5 శాతాన్ని స్థానికేతరులతో భర్తీ చేస్తారు.

టీఆర్టీ ఫలితాల అనంతరం ధ్రువపత్రాలు పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు.

ఎవరైనా అభ్యర్థి ఎస్జీటీగా, ఎస్ఏ గా ఎంపికైతే… ఎందులో చేరతారో ముందే నిర్ణయించుకొని చెప్పాలి. వారి నుంచి హామీపత్రం తీసుకుంటారు. వదులుకున్న పోస్టులో తర్వాతి అభ్యర్థికి అవకాశమిస్తారు.

మార్కులు సమానంగా (టీఆర్టీ+ టెట్ కలిపి) ఉంటే వయసు ఎక్కువున్న ర్యాంకులో ప్రాధాన్యం ఇస్తారు. అది సమానంగా వారికి ఉంటే అమ్మాయికి ప్రాధాన్యం ఇస్తారు. అదీ సమానంగా ఉంటే ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, ఓసీలకు ర్యాంకులు కేటాయిస్తారు. అదీ టై అయితే వారి చదువులో సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు.