అక్టోబర్ 9న డీఎస్సీ నియామక పత్రాలు అందజేత – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (OCT. 04) : DSC 2024 APPOINTMENT ORDERS ON 9th October. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ DSC-2024లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల 5 వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

DSC 2024 APPOINTMENT ORDERS ON 9th October

రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు.

దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 9 వ తేదీన వారందరికీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించాలని సీఎం గారు ఇప్పటికే ఆదేశించారు.

సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు నిర్ధేశించిన గడువులోగా సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు