BIKKI NEWS : Dr. Manmohan Singh Biography in Telugu. డా. మన్మోహన్ సింగ్ (1932 సెప్టెంబరు 26 – 2024 డిసెంబరు 26) భారత దేశ మాజీ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22న బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల ఆయన 1991లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన భారతదేశ చరిత్రలో సంస్కరణల పితామహుడిగా పేరుగాంచాడు.
Dr. Manmohan Singh Biography in Telugu
బాల్యం
1932 సెప్టెంబరు 26న పంజాబ్ (ఇప్పటి చక్వాల్ , పాకిస్తాన్) లో ఒక కోహ్లీ కుటుంబములో జన్మించారు. 14వ, ప్రస్తుత ప్రధానమంత్రి. 1958 లో గురుషరణ్ కౌర్తో వివాహమాడిన డా.సింహకు ముగ్గురు కుమార్తెలు. వీరు ముగ్గురూ మతాంతర వివాహాలు చేసుకోవడం విశేషం.
విద్యాభ్యాసం
ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి 1952లో అర్థశాస్త్రములో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసాడు. ఆ తరువాత
1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయము లో బ్యాచిలర్స్,
1962లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి డాక్టరేట్ పూర్తి చేశారు.
ఉద్యోగాలు
1957-59 : సీనియర్ లెక్చరర్, ఆర్థికశాస్త్రం.
1959-63 : రీడర్, ఆర్థికశాస్త్రం.
1963-65 : ప్రొఫెసర్, ఆర్థికశాస్త్రం, పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.
1969-71 : ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
1976 : గౌరవ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
రాజ్యసభ సభ్యుడిగా
మన్మోహన్ సింగ్ 1991 అక్టోబరు 1 నుండి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు.
సేవలు
1971-72: ఆర్థిక సలహాదారు, విదేశీ వాణిజ్య మంత్రాలయం.
1972-76: ప్రధాన విత్త సలహాదారుడు, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
1976-80: భారత రిజర్వు బ్యాంకు డైరెక్టర్.
డైరెక్టర్, భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు.
ఆసియాభివృద్ధి బ్యాంకుకు భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు. బర్డ్, ప్రత్యామ్నాయ గవర్నరు.
1976 నవంబరు – 1980 ఏప్రిల్: కార్యదర్శి, భారత ఆర్థిక శాఖ.వసభ్యుడు, ఆర్థిక శాఖ, అణుశక్తి కమిషను, అంతరిక్ష కమిషను.
1980 ఏప్రిల్ – 1982 సెప్టెంబరు 15 : ప్లానింగ్ కమిషన్ సభ్యుడు-కార్యదర్శి
1980-83: ఛైర్మన్, భారత్-జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత కమిటీ.
1982 సెప్టెంబరు 16 – 1985 జనవరి 14 : రిజర్వ్ బ్యాంకు గవర్నరు.
1982-85: ఐ.ఎమ్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.
1983-84: సభ్యుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్.
1985: అధ్యక్షుడు, ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్.
1985 జనవరి 15 – 1987 జూలై 31 : డిప్యూటి ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్
1987 ఆగస్టు 1 – నవంబరు 10, 19! 90: సెక్రటరి జనరల్, కమీషనర్, సౌత్ కమిషన్, జెనీవా.
1990 డిసెంబరు 10 – 1991 మార్చి 14 : ప్రధానమంత్రి సలహాదారుడు, ఆర్థిక విషయాలు.
1991 మార్చి 15 – 1991 జూన్ 20 : యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్.
1991 జూన్ 21 – 1996 మే 15 : కేంద్ర ఆర్థిక మంత్రి.
1991 అక్టోబరు: అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యుడిగా గెలుపు.
1995 జూన్: రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నిక.
1996 ఆతరువాత : సభ్యుడు, కాన్సులేటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
1996 ఆగస్టు 1 – 1997 డిసెంబరు 4 : ఛైర్మన్, వ్యాపారరంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.
1998 మార్చి 21 ఆతరువాత : రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు.
1998 జూన్ 5 ఆతరువాత : సభ్యుడు, ఆర్థికంపై కమిటీ.
1998 ఆగస్టు 13 ఆతరువాత : సభ్యుడు, కమిటీ ఆన్ రూల్స్.
1998 ఆగస్టు-2001 : సభ్యుడు, కమిటీ ఆఫ్ ప్రివిలైజెస్.
2000 ఆ తరువాత : సభ్యుడు, ఎక్జిక్యూటివ్ కమిటీ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్.
2001 జూన్: రాజ్యసభకు తిరిగి ఎన్నిక.
2001 ఆగస్టు తరువాత : సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ.
రచనలు
ఇండియాస్ ఎక్స్‌పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఫార్ సెల్ఫ్-సస్టైన్‌డ్ గ్రోత్ : క్లారెండోన్ ప్రెస్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, 1964.
అనేక ఆర్థిక జర్నల్స్ కొరకు అనేకానేక ఆర్టికల్స్.
పురస్కారాలు
- ఆడమ్ స్మిత్ ప్రైజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం – 1956
- పద్మవిభూషణ్ – 1987
- యూరో మనీ అవార్డు, 1993
- ఉత్తమ ఆర్థికమంత్రి. ఏషియా మనీ అవార్డు, ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి – 1993, 1994
- ఇందిరా గాంధీ బహుమతి -2017
మరణం
92 ఏళ్ల మన్మోహన్ సింగ్ 2024 డిసెంబరు 26న తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ