DOST 2024 – సొంతంగా డిగ్రీ అడ్మిషన్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందటానికి ఉన్నత విద్యా మండలి దోస్త్ (DOST) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్త్ (DOST) వెబ్సైట్ ను సందర్శించి విద్యార్థులు నేరుగా అడ్మిషన్లు పొందేందుకు వీలు కల్పించింది…

DOST WEBSITE

అడ్మిషన్ల ప్రక్రియ లో మూడు దశలు ఉంటాయి.

  • విద్యార్థి రిజిస్ట్రేషన్
  • రిజిస్ట్రేషన్ పీజు పేమెంట్
  • లాగిన్ అవ్వడం & వెబ్ ఆప్షన్ ఎంచుకోవడం

★ విద్యార్థి రిజిస్ట్రేషన్ ::

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ తో లింక్ ఉన్న ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ లతో సొంతంగా తమ మొబైల్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా “టి యాప్ ఫోలియో” అనే అప్లికేషన్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని దానిలో కూడా హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సెల్ఫీ దిగడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

రిజిస్ట్రేషన్ పూర్తవగానే మీకు ఒక దోస్త్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మరియు పిన్ అనేవి SMS రూపంలో రావడం జరుగుతుంది. ఈ దోస్త్ ఐడి అనేది మీకు చివరి వరకు లాగిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది.

★ రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్

రిజిస్ట్రేషన్ ఫీజు మొదటి దశలో అయితే ₹200 రెండవ, మూడవ దశలో అయితే ₹400 చెల్లించాల్సి ఉంటుంది.

★ లాగిన్ అవ్వడం & కళాశాలల ఎంపిక (వెబ్ ఆప్షన్)

విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పూర్తి ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీకు దగ్గర ఉన్న లాగిన్ ఐడి మరియు పిన్ లను ఉపయోగించి మీరు దోస్త్ వెబ్ సైట్ నందు లాగిన్ కావలసి ఉంటుంది.

లాగిన్ అయిన తర్వాత మీకు నచ్చిన కోర్స్ మరియు కళాశాలలను మీకు ప్రాధాన్యత ప్రకారం ఆర్డర్ లో పెట్టుకోని సబ్మిట్ చేయాలి. ఈ వెబ్ ఆప్షన్ లు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అమలులో ఉన్న మెరిట్ మరియు రిజర్వేషన్లు ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి.

కేటాయించబడిన కళాశాల విద్యార్థికి నచ్చితే DOST వెబ్సైట్ లో “ఆన్లైన్ సెల్ప్ రిపోర్టింగ్” చేయాలి. మరియు – మీకు కేటాయించిన కళాశాల కు వెళ్లి సర్టిఫికెట్ లు పీజు చెల్లిస్తే మీ సీటు ధృవీకరించబడుతుంది.

దోస్త్ (DOST) నోటిఫికేషన్ మరియు ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి

ఇంటర్మీడియట్ ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి