BIKKI NEWS (MARCH 31) : ఎక్కడ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్స్ కనిపిస్తే అక్కడ ఛార్జింగ్ పెట్టేస్తాం. బస్ స్టాండ్లు, ఎయిర్‌పోర్టులు, హోటళ్లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో ఫోన్ ఛార్జింగ్ ( చేయొద్దని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-IN) హెచ్చరించింది. లేకపోతే సైబర్ దాడులు ఎదుర్కోవాల్సి రావొచ్చని తెలిపింది.
బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యూఎస్‌బీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఆసరాగా చేసుకొని సైబర్ మోసగాళ్ళు సైబర్ దాడులకు పాల్పడుతున్నారని, వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడం లేదా వారి పరికరాల్లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం కోసం ఛార్జింగ్ పోర్ట్స్ ఉపయోగించుకుంటున్నారని. ఈ తరహా దాడులనే జ్యూస్ జాకింగ్ అంటారు. వీటితో జాగ్రత్త వహించాలంటూ CERT-IN సూచించింది.
సైబర్ దాడుల బారిన పడకుండా ఉండాలంటే, ఇకపై బయటకు వెళ్లినప్పుడు ఎలక్ట్రికల్ వాల్ అవుట్‌లెట్‌ను మాత్రమే ఎంచుకోండి. లేదా కేబుల్స్, పవర్ బ్యాంక్‌లను తీసుకెళ్లడం ఉత్తమం. వేరే పరికరాలకు కనెక్ట్ చేయొద్దు. ఒకవేళ సైబర్ దాడి జరిగితే www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయొచ్చు. లేదా 1930 హెల్ప్‌లైన్ నంబరుకు కాల్ చేయండి.