BIKKI NEWS (JUNE 25) : Donald Trump dream Nobel Peace prize. ఓ సీజ్ ఫైర్ – ఓ నోబెల్ బహుమతి – ఓ ట్రంప్ కథ ఇది.
Donald Trump dream Nobel Peace prize.
ప్రపంచాన్ని మహా యుద్దాల నుండి “సీజ్ ద ఫైర్” అనే ఒక్క డైలాగ్ తో కాపాడిన శాంతి కామకుడు డోనాల్డ్ ట్రంప్…
ఇరాన్ తయారు చేయనున్న అణ్వాయుధాల నుంచి ప్రపంచం నాశనం కాకుండా వాటిని ఒక్క రాత్రిలో నాశనం చేసిన యుద్ధ వీరుడు డోనాల్డ్ ట్రంప్…
అలాంటి ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదా.? “నాకు నోబెల్ శాంతి బహుమతి రాదేమో” అని అంతటి ట్రంప్ నిర్వేదం వ్యక్తం చేయాలా…
వైట్ హౌస్ లో కుర్చీ వేసుకుని కూర్చుంటే నోబెల్ కమిటీ వాళ్లే వెతుక్కుంటూ వెళ్ళి నోబెల్ శాంతి బహుమతి ని ప్రధానం చేయాల్సినంత గొప్ప పనులను చేశానని, అయినా నోబెల్ తనకు దక్కదేమోనని తన పేరు ఒబామా అయితే ఇప్పటికే 10 నోబెల్ బహుమతులు వచ్చేవేమో అని నిట్టూర్పులను ట్రంప్ విడవాలా…
భారత్ – పాకిస్థాన్ యుద్ధం కానివ్వండి, ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం కానివ్వండి ఒక్క సీజ్ ఫైర్ డైలాగ్ తో ఆపగలిగిన శక్తి ట్రంప్ కు మాత్రమే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అప్పటిదాకా ఉన్న శత్రుత్వాలు, నాయకుల మద్య ఉన్న ఈగోలు అన్ని పక్కన పెట్టి ట్రంప్ మాటకి కట్టుబడి ఉండటమంటే మామూలు విషయం కాదు… అలాంటి ట్రంప్ కు ఒక్క నోబెల్ శాంతి బహుమతి కాదు ఎన్ని ఇచ్చినా తక్కువేనని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
పాకిస్థాన్ దేశం డోనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఇరాన్ ని. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు తన దేశంలో శాంతిని నెలకొల్పినందుకు పాకిస్తాన్ ఈ పని చేసి ఉండొచ్చు.
ఉక్రెయిన్ నుండి ఒలెక్సాండర్ డోనాల్డ్ ట్రంప్ పేరు నోబెల్ శాంతికి నామినేట్ చేసి, తాజాగా విత్ డ్రా చేసుకున్నాడు.
ఇప్పుడు అమెరికా సెనేట్ సభ్యుడు బడ్డీ కార్టర్ అధికారికంగా డోనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాడు.
ప్రపంచ శాంతి కోసం ఈమధ్య ఇంతలా పాటుపడిన వ్యక్తి భూతద్దం పెట్టి వెతికిన కనపడడు.. అయినప్పటికీ ట్రంప్ మనసులో ఒక్కటే డైలాగ్ ‘ఒక్కటి తక్కువైంది’ ఆ ఒక్కటి దక్కుతుందో లేదో చూద్దాం…
- ASHA WORKER JOBS – పార్వతిపురం జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- ASHA WORKER JOBS – అనంతపురం జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- DAILY GK BITS IN TELUGU 26th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 26
- WORLD REFRIGERATION DAY – ప్రపంచ శీతలీకరణ దినోత్సవం