- విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం తగ్గించాలి.
- తెలంగాణ ఇంటర్ విద్య డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య.
- ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి TGJLA -475 పూర్తి సహకారం
BIKKI NEWS (DEC. 13) : Director krishna Aditya Says decrease the dropout rate. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి ఇంటర్ విద్య డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య గారు తీసుకున్న చర్యలకు పూర్తిగా సహకరిస్తామని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్- 475 రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.
Director krishna Aditya Says decrease the dropout rate
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా కార్యదర్శి మరియు ఇంటర్ విద్యా డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య గారి ఆహ్వానం మేరకు తమ సంఘము నుంచి ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ ఇంటర్ విద్యాభివృద్ధి గురించి పలు విషయాల గురించి చర్చించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజర శాతం పెరగటం లక్ష్యంగా మనమందరం కలిసి పని చేయాలని తెలిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం తగ్గించాలని, ఇందుకు అందరం కలిసి కృషి చేద్దామని తెలిపారు. సరైన కారణాలు లేకుండా కళాశాలలకు హాజరుకాని విద్యార్థులు పట్ల చాలా గట్టిగా వ్యవహరించాలని, వారి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజెప్పాలని కోరారు .
ఈ సందర్భంగా ఇంటర్ విద్యకు సంబంధించి 27 జిల్లాల్లో ఇంటర్ విద్యా పర్యవేక్షణ DIEO పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరడం జరిగింది. నూతనంగా ఏర్పడిన సుమారు 27 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్- టీచింగ్ పోస్టులు శాంక్షన్ చేయాలని ఇంటర్ విద్య డైరెక్టర్ గారిని కోరడం జరిగిందని తెలిపారు.
అలాగే విద్యార్థులకు ప్రతి నెల స్కాలర్షిప్ అందజేయాలని, దీనివలన కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరిగి, ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని తెలియచెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ బోధనలో సెకండ్ పోస్టు లో ఒకేషనల్ అధ్యాపకులను నియమించాలని, చరిత్రకు, రాజనీతి శాస్త్రం పోస్టులకు విడివిడిగా అధ్యాపకులు నియమించాలని కోరడం జరిగింది. నూతనంగా క్రమబద్దీకరణ జరిగిన అధ్యాపకుల కు సంబంధించి పోలీస్ వెరిఫికేషన్ త్వరగా పూర్తిచేసి రోస్టర్ పాయింట్ల కేటాయించాలని కోరుతూ, వేసవి సెలవుల్లో ఎన్నికల విధులు నిర్వహించిన వారికి ఈఎల్ శాంక్షన్ చేయాలని కోరుతూ.. పలు సూచనలకు సంబంధించిన వినతి పత్రాన్ని డైరెక్టర్ గారికి అందజేయడం జరిగిందని తెలిపారు.
డైరెక్టర్ గారు ఈ సూచనలపై సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ ప్రతినిధి వర్గంలో రాష్ట్ర కార్యనిర్వాక సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ కెపి శోభన్ బాబు, రాష్ట్ర మహిళా కార్యదర్శులు సంగీత, విశాలాక్ష్మి తదితరులు పాల్గొన్నారు.