Home > UNCATEGORY > జీజేసి వర్గల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిద్దిపేట జిల్లా డీఐఈవో రవీందర్ రెడ్డి

జీజేసి వర్గల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిద్దిపేట జిల్లా డీఐఈవో రవీందర్ రెడ్డి

వర్గల్ (జనవరి 22) : DIEO Ravinder Reddy Visited GJC Wargal. ప్రభుత్వ జూనియర్ కళాశాల వర్గల్ ను ఈరోజు సిద్దిపేట డిఐఈఓ రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో అన్ని రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

DIEO Ravinder Reddy Visited GJC Wargal

అలాగే 90 రోజుల యాక్షన్ ప్లాన్ ను కళాశాల అధ్యాపకుల తప్పనిసరిగా అమలు చేయాలని, లాంగ్ అబ్సెంటీస్ విద్యార్థులను కళాశాలకు రప్పించాలని ఆదేశించారు.

విద్యార్థులు కచ్చితంగా 90% హజరు శాతం ఉండేలా చొరవ తీసుకోవాలని, కళాశాలకు రాని విద్యార్థుల ఇళ్ళను సందర్శించి వారి పేరెంట్స్ తో మాట్లాడాలని, కళాశాలకు రప్పించాలని పేర్కొన్నారు.

అధ్యాపకులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు మరియు ఫలితాలను మరింతగా పెంచాలని సూచించారు

విద్యార్థిని, విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ద పెట్టాలని, 100% ఉతీర్ణత సాధించాలని వివరించారు. అలాగే సెల్ ఫోనులకు, సోషల్ మీడియాకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి లక్ష్యాన్ని ఏర్పరచుకొని జీవితంలో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు