హరప్పా నాగరికతకు ధోలవిర నగరం ఓ గుర్తుగా నిలుస్తుంది. యునెస్కో ప్రస్తుతం గుజరాత్‌లోని ధోలవిర ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపద(వరల్డ్ హెరిటేజ్) జాబితాలో చేర్చింది. దోలవిరా ఇప్పుడు భారత్లో 40వ వారసత్వ సంపదగా నిలిచింది.
రెండు రోజుల క్రితమే తెలంగాణలోని రామప్ప ఆలయాన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో ప్రకటించిన విషయం తెలిసిందే.
2014 నుంచి భారత్‌లో కొత్తగా పది ప్రపంచ వారసత్వ సంపదలుగా జాబితాలో చేరాయని, ఇది మొత్తం సైట్లలో నాలుగవ వంతు అని, ప్రధాని మోదీ కమిట్‌మెంట్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.