భక్తి ఉద్యమాలు – ప్రబోధకులు – సిద్దాంతాలు

BIKKI NEWS : devotional movements preachers doctrines in telugu

devotional movements preachers doctrines in telugu

★ ఆది శంకరచార్య :- (క్రీ.శ. 788) కేరళలోని కలాడిలో జన్మించారు. అద్వైత సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు.

★ రామానుజాచార్య :- శ్రీపెరంబుదూరు (తమిళనాడు), 11వ శతాబ్దం. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.

★ మధ్వాచార్య :- శృంగేరి (కర్ణాటక). 18వ శతాబ్దం. ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.

★ నింబార్కుడు :- ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. ద్వైతాద్వైతాన్ని ప్రచారం చేశారు.

★ బసవేశ్వరుడు :- కర్ణాటక (12వ శతాబ్దం). వీరశైవ మతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

★ రామానంద :- తొలి ఉత్తర భారత భక్తి ఉద్యమకారుడు (14వ శతాబ్దం). ఇతని శిష్యులు అవధూతలు’గా ప్రసిద్ధులు. వీరిలో కబీర్, రైదాస, సేన ముఖ్యులు.

★ అన్నమాచార్య :- ఆంధ్రప్రదేశ్ 16వ శతాబ్దం. తిరుమల శ్రీ వేంకటేశ్వరునిపై వేల సంఖ్యలో కీర్తనలు రచించారు.

★ తులసీదాస్ :- రామభక్తిని ప్రచారం చేశారు (15-16 శతాబ్దం) రామచరిత మానస్, హనుమాన్ చాలీసా రాశారు.

★ చైతన్యుడు :- బెంగాల్, రాగమార్గ (15-16 శతాబ్దం)

★ జ్ఞానేశ్వర్ :- మహారాష్ట్రలో తొలి భక్తి ఉద్యమకారుడు

★ నామ్ దేవ్ :- నిర్గుణ భక్తిని ప్రచారం చేశారు. ఇతను మరాఠీ భాషలో అభంగాలు (భక్తిరస పాటలు) రాశారు.

★ తుకారాం :- పరాకారి తత్వాన్ని ప్రబోధించాడు.

★ సమర్థ రామదాసు :- ధరకారి తత్వాన్ని ప్రబోధించారు. ఇతను శివాజీ గురువు. రాజకీయాలపై ఆసక్తి కనబరిచే సన్యాసులను ధరాకారులు అంటారు. మొగల్ పాలనను అంతమొందించటానికి శివాజీని అధికంగా పోత్సహించాడు

సూరదాస్ :- 16వ శతాబ్దం. కృష్ణ భక్తి గీతాలకు ప్రసిద్ది. ఇతని గీతాలు సూర సాగర్ గా గ్రంథస్తం చేయబడ్డాయి. ఇతను గుడ్డివాడు

★ కబీర్ :-నిర్గుణ భక్తి ప్రచారం చేశారు. కబీర్ రచనలు దోహాలుగా ప్రసిద్ధిగాంచాయి.(15–16 శతాబ్దం)

★ గురునానక్ :- పంజాబ్ లోని తల్వండిలో జన్మించారు. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించారు. (15-16 శతాబ్దాలు)

JOB NOTIFICATIONS

TELEGRAM CHANNEL