DEPARTMENTAL TESTS : పూర్తి నోటిఫికేషన్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 02) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 2023 నవంబర్ సెషన్ కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకై డిపార్ట్మెంటల్ టెస్ట్ ల (Telangana employees departmental Tests) కు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో నిర్వహించనున్నారు.

నవంబర్ 17 నుండి 25వ తేదీ మధ్య హైదరాబాద్ సహా 9 జిల్లా కేంద్రాలలో నిర్వహించనున్నారు.

పరీక్షకు దరఖాస్తు గడుగు సెప్టెంబర్ 8 నుండి అక్టోబర్ 3వ తేదీ 5.00 గంటల వరకు కలదు.

దరఖాస్తు ఫీజు 400/- రూపాయలు. హల్ టికెట్లను పరీక్షకు వారం రోజుల ముందు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

పరీక్ష కేంద్రాలు : ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, హైదరాబాద్ (రంగారెడ్డి), నిజామాబాద్.

ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గెజిటెడ్ పోస్టుల కోసం పేపర్ 88, 97 లను రాయవలసి ఉంటుంది. నూతనంగా క్రమబద్ధీకరణ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్లు ఈ పరీక్షలు రాయవలసి ఉంటుంది.

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/