WORLD COCONUT DAY : ప్రపంచ కొబ్బరి దినోత్సవం

BIKKI NEWS (సెప్టెంబర్ – 02) ప్రపంచ కొబ్బరి దినోత్సవం (WORLD COCONUT DAY SEPTEMBER 2nd ) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2వ తేదీన నిర్వహిస్తారు.

పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తున్న కొబ్బరికాయ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

★ చరిత్ర

ప్రపంచ కొబ్బరి దినోత్సవం (WORLD COCONUT DAY) మొదటిసారి 2009 వ సంవత్సరంలో సెప్టెంబర్ 02న ప్రారంభమైంది.

కొబ్బరి ఉత్పత్తులను మరింత పెంచి, దాని ప్రాధాన్యాన్ని తెలుపడంకోసం 1969, సెప్టెంబరు 2న ఇండోనేషియా రాజధాని జకార్తాలో ది ఏషియా- పసిఫిక్‌ కొకోనట్‌ కమ్యూనిటి (APCC) అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు అయింది. ఆరోజు ఆసియా, పసిఫిక్‌ దేశాల ప్రతినిధులు సమావేశమై ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో భాగంగా కొబ్బరి అభివృద్ధి కోసం అనేక తీర్మానాలు చేశారు. అందుకు గుర్తుగా సెప్టెంబరు 2ను అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవంగా ప్రకటించి, ప్రతి సంవత్సం వేడుకలు జరుపుకుంటున్నారు.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కొబ్బరి అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, సమన్వయం చేయడానికి ది ఏషియా- పసిఫిక్‌ కొకోనట్‌ కమ్యూనిటిలో 18 సభ్య దేశాలు ఉన్నాయి.

Courtesy : wikipedia