BIKKI NEWS (APR. 17) : Department wise Telangans job vacancies 2025 . తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీగా ఉన్న 56 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖాలలో 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
Department wise Telangans job vacancies 2025
వీటిలో ఇప్పటికే గుర్తించి.. ఖరారు చేసిన 14,236 అంగన్‌వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్-1, 2, 3, 4 పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. అయితే ఎస్సీవర్గీకరణ చేపట్టి, రిజర్వేషన్లు ఖరారు చేసే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో అప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్లు రాలేదు.
ఇటీవల ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించినట్తు తెలుస్తోంది.
- పోలీసు శాఖ 12,150
- వైద్యశాఖ 2,762
- ఆర్టీసీ 3,038
- గురుకులాలు 2,850
- ఇంజనీరింగ్ 2,510
- వ్యవసాయ శాఖ 148
- ఆర్‌అండ్‌బీ 185
- రెవెన్యూ 10,954
- మహిళా శిశుసంక్షేమం 14,236
- విద్యాశాఖ – 6,000
- గ్రూప్ 1, 2, 3, 4 – 1,000
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్