Home > EDUCATION > UNIVERSITIES NEWS > SATAVAHANA UNIVERSITY – పాత డిగ్రీ విద్యార్థులకు సప్లిమెంటరీ అవకాశం

SATAVAHANA UNIVERSITY – పాత డిగ్రీ విద్యార్థులకు సప్లిమెంటరీ అవకాశం

BIKKI NEWS (SEP. 14) : Degree supplementary exams last chance for clearance of backlogs. తెలంగాణ రాష్ట్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీలో చేరి సకాలంలో పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలని యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటన విడుదల చేశారు.

Degree supplementary exams last chance for clearance of backlogs

సెమిస్టర్ విధానానికి ముందు బీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో చేరి ఉత్తీర్ణులు కానివారు తమ బ్యాక్ లాగ్ సబ్జెక్టులకు త్వరలో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇలా బ్యాక్‌లాగ్ సబ్జెక్టు లు కలిగిన విద్యార్థులు అక్టోబర్ 8వ తేదీలోపు తాము చదువుకున్న డిగ్రీ కాలేజీలో సంప్రదించి పరీక్ష ఫీజులు చెల్లించాలని సూచించారు. ఇది యూనివర్సిటీ కల్పిస్తున్న చివరి అవకాశమని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు