Degree Colleges – నేటి నుండి డిగ్రీ కళాశాలలు నిరవధిక బంద్

BIKKI NEWS (NOV. 19) : Degree Colleges bandh in telangana. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు నేటి నుండి నిరవధికంగా బంద్ ను పాటిస్తున్నాయి. ఈ మేరకు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.

Degree Colleges bandh in telangana

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల డిమాండ్‌తో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. బకాయిలు విడుదల చేసే వరకు బంద్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను కూడా బహిష్కరిస్తున్నట్టు తేల్చి చెప్పాయి. ప్రభుత్వం రూ.2 వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం స్పష్టం చేసింది. కాలేజీలు బంద్‌లో పాల్గొనాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

డిగ్రీ సెమిస్టర్ పరీక్షలపై తీవ్ర ప్రభావం

కాలేజీల బంద్‌ ప్రభావం డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలపై పడనుంది. డిగ్రీ 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు ఈ వారంలో, ఓయూ పరీక్షలు నేటి నుంచి జరగాల్సి ఉంది. 21 నుంచి మహత్మాగాంధీ, 26 నుంచి కాకతీయ, పాలమూరు వర్సిటీల పరీక్షలు ప్రారంభం కావాలి. ఈ నెలలోనే తెలంగాణ, శాతవాహన వర్సిటీల సెమిస్టర్‌ పరీక్షలు ఉన్నాయి. నెలాఖరు నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ పరీక్షలు జరగకపోతే విద్యాసంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపనుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు