BIKKI NEWS (JULY 21) : DASARATHI AWARD 2024 TO JUKANTI JAGANNTAHAM. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ రచయిత జోకండి జగన్నాథంకు దాశరధి పురస్కారం 2024 ను ప్రకటించింది ఈ పురస్కారం కింద లక్షా వెయ్యి నూటపదహర్లు నగదు బహుమతిని మరియు జ్ఞాపికను రచయితకు అందజేస్తారు.
DASARATHI AWARD 2024 TO JUKANTI JAGANNTAHAM
జూకంటి జగన్నాథం గురించి
కవిగా, రచయితగా జూకంటి జగన్నాథం ప్రస్థానం దాదాపు మూడున్నర దశాబ్దాలు. ఆయన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రం. ఆయన 1993లో మొదటి కవితా సంకలనం ‘పాతాళ గరిగె’ ను విడుదల చేశారు. తర్వాత సుమారు 16 కవితా సంకలనాలు వెలువరించారు. ఆయన కవితలు కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లిష్ బాషలలోకి అనువాదం అయ్యాయి. 2005లో ‘జూకంటి కథలు’ , 2020లో ‘జూకంటి జగన్నాథం కథలు’ పేరుతో కథా సంకలనాలు వెలువరించారు.
ఆయనను పలు అవార్డులు రివార్డులు వరించాయి. 1998లో మొదటిసారి సినారె కవితా పురస్కారం అందుకున్నారు. ఆయన 2014 నుంచి ఆలిండియా తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.