BIKKI NEWS (SEP. 19) : DASARA HOLIDAYS 2024 IN TELANGANA. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
DASARA HOLIDAYS 2024 IN TELANGANA
13 రోజుల అనంతరం అంటే అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగను జరుపుకోనున్నారు.
డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ హాలీడేస్‌ను (CHRISTMAS HOLIDAYS 2024 IN TELANGANA) కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్రాంతి సెలవులు ఐదు రోజులు ఇచ్చారు
అయితే ఇంటర్మీడియట్ కళాశాలలకు అకాడమిక్ కేలండర్ ప్రకారం అక్టోబర్ 06 నుండి 13 వరకు దసరా సెలవులు కలవు.