BIKKI NEWS (SEP. 20) : DASARA BONUS 1.90 LAKHS TO SINGARENI EMPLOYEES. సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీపి కబురు అందించారు. గతేడాది సింగరేణి సంస్థ ఉత్పత్తి, గడించిన లాభాల ఆధారంగా బోనస్‌ను ప్రకటించారు. ఒక్కో కార్మికునికి రూ.1.90 లక్షలు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేలు చొప్పున బోనస్ చెల్లించాలని నిర్ణయించారు.
DASARA BONUS 1.90 LAKHS TO SINGARENI EMPLOYEES
తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు అగ్రభాగాన నిలిచారని, ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంతో గని కార్మికుల పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
సింగరేణి లాభాలు, విస్తరణ.. బోనస్‌కు సంబంధించిన వివరాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు వివరించారు.
సింగరేణి కార్మికుల శ్రమతో 2023-24 సంవత్సరంలో సంస్థకు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సంస్థ విస్తరణ, పెట్టుబడులకు రూ.2,289 కోట్లు కేటాయించగా మిగిలినవి రూ.2,412 కోట్లు. ఇందులో మూడో వంతు రూ. 796 కోట్లను కార్మికులకు బోనస్‌గా ప్రకటించారు.
సింగరేణిలో మొత్తం 41,387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకొక్కరికి బోనస్ కింద రూ.1.90 లక్షలు. గతేడాది సింగరేణి కార్మికులకు అందిన బోనస్ రూ.1.70 లక్షలు మాత్రమే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా ఒకొక్కరికి రూ.20 వేలు.
సంస్థ చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లింపు. సంస్థలోని 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు తొలిసారి రూ.5 వేల చొప్పున బోనస్.
సింగరేణి సంస్థ భవిష్యత్ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం.
సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1000 మెగావాట్లకు విస్తరించడం, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, జైపూర్‌లోని ప్రస్తుత థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో మరో 1×800 మెగావాట్ల సామర్థ్యం కల మరో థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం, రామగుండంలో టీఎస్ జెన్ కో ఆధ్వర్యంలో మరో 1×800 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన (పిట్‌హెడ్) 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం.
వీటితో పాటు సింగరేణి కుటుంబాల సంక్షేమానికి పాఠశాలలు, హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం.