DAILY G.K. BITS IN TELUGU 28th SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 28th SEPTEMBER

1) తెలంగాణ రాష్ట్రంలో త్రికూట దేవాలయం ఎక్కడ ఉంది.?
జ : హనుమకొండ

2) సంస్కృతంలోని ఐదు మహాకావ్యాలపై వ్యాఖ్యానాలు రాసిన ఒకే ఒక తెలుగు కవి ఎవరు.?
జ : మల్లినాధ సూరి

3) రాతి చెక్కడాలకు ఉపయోగించే రామడుగు శిలలు ఏ రకానికి చెందినవి.?
జ : అమృతశిలలు

4) తెలంగాణ రాష్ట్రంలో 2015 – 16 లో 30.5% ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జననాలు 2022 నాటికి ఎంతకు చేరాయి.?
జ : 61%

5) తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం ఎంత.?
జ : 15.45%

6) తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ఎంత.?
జ : 988

7) తెలంగాణ రాష్ట్ర వార్షిక వర్షపాతం లో ఏ రుతుపవనాల వలన అధికంగా వర్షాలు పడతాయి.?
జ : నైరుతి రుతుపవనాలు

8) తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో పూర్తిగా ఎర్ర నేలలు, చల్క నేలలతో కూడి ఉంటుంది.?
జ :నల్గొండ

9) తెలంగాణ రాష్ట్ర భూగర్భ జలాల ఇయర్ బుక్ 2020- 21 ప్రకారం తెలంగాణ భౌగోళిక ప్రాంతం ఎంత మేరకు స్పటికాకార శిలలతో కప్పబడి ఉంది.?
జ :83%

10) హరిజన్ అనే పదాన్ని ఎవరు ప్రాచుర్యంలోకి తెచ్చారు.?
జ : మహాత్మా గాంధీ

11) హరిత విప్లవం సాంకేతికతతో ఏవేమి మార్పు చెందాయి.?
జ : విత్తనాలు, నీటిపారుదల, ఎరువులు

12) భారత హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు వరల్డ్ పుడ్ ప్రైజ్ ఏ సంవత్సరంలో లభించింది.?
జ : 1987