DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th SEPTEMBER 2023

1) జీ 20 శిఖరాగ్ర సదస్సులో చోటు సంపాదించుకున్న తెలంగాణ వస్త్రం ఏది .?
జ : తేలియా రుమాల్

2) తేలియా రుమాల్ కు ఆ పేరు ఎలా వచ్చింది.?
జ : రంగుల అద్దకానికి ముందు నువ్వులు ఆముదం నూనెలో వస్త్రాన్ని శుభ్రపరుస్తారు

3) దేశంలో ఏ రాష్ట్ర రైతుల పై అత్యధిక రుణ భారం (3,47,217) ఉన్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన వేదికలో వెల్లడించింది.?
జ : తమిళనాడు

4) టాస్ స్టీల్ జస్ట్ టోర్నమెంట్ 2023లో మహిళల బ్లిట్జ్ విభాగంలో విజేతగా నిలిచినది ఎవరు.?
జ :జు వెంజూన్ – చైనా (రన్నర్ – కోనేరు హంపి)

5) సెప్టెంబర్ 4 నుండి 14 వరకు భారత వాయుసేన చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో నిర్వహించిన సైనిక విన్యాసాల పేరు ఏమిటి.?
జ : త్రిశూల్

6) ఆసియా కప్ 2023లో సూపర్ – 4 కు చేరిన జట్లు ఏవి.?
జ : ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్.

7) ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ సర్జ్ పూల్ ను ఏదుల వద్ద ఏ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు.?
జ : పాలమూరు రంగారెడ్డి

8) 2003 నుండి 2022 వరకు గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ – 100 అంశాలలో మొదటి స్థానంలో నిలిచిన అంశాలు ఏవి.?
జ : అల్ జజీరా

9) 2003 నుండి 2022 వరకు గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ – 100 మొదటి స్థానంలో నిలిచిన సెలబ్రిటీ ఏవరు.?
జ : బ్రిట్నీ స్పియర్

10) 2003 నుండి 2022 వరకు గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ – 100 టెక్నాలజీ లో మొదటి స్థానంలో నిలిచిది ఏది.?
జ : ఫేస్‌బుక్

11) 2003 నుండి 2022 వరకు గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ – 100 సినిమాలలో మొదటి స్థానంలో నిలిచిన సినిమా ఏది.?
జ : హ్యరీపోటర్

12) ఇటీవల ఏ దేశం అంతరిక్ష పరిశోధనల కోసం అత్యంత భారీ టెలిస్కోప్ ను నిర్మిస్తుంది.?
జ : చైనా

13) గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు 2023 ఏ రాష్ట్రం ఆతిద్యమిస్తుంది.?
జ : ఉత్తరాఖండ్

14) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది.?
జ : 9 సంవత్సరాలు

15) పౌర విమానయాన రంగంలో భారతదేశం ఏ దేశంతో ఇటీవల ఒప్పందం చేసుకుంది.?
జ : న్యూజిలాండ్