DAILY CURRENT AFFAIRS IN TELUGU 7th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 7th AUGUST 2023

1) అంతర్జాతీయ పులుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 29

2) 26 రఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్, 3 – స్కార్పియన్ డీజిల్ – ఎలక్ర్టికల్ సబ్ మెరైన్స్ కొనుగోలు కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : ప్రాన్స్

3) భారత చిత్ర పరిశ్రమలో పైరసీ కారణంగా సంవత్సరానికి ఎన్ని కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.?
జ : 20వేల కోట్లు

4) టెస్లా సంస్థ నూతన చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు.?
జ : వైభవ్ తనెజా

5) గత తొమ్మిది సంవత్సరాలలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ ఎన్ని వేల కోట్ల మొండి బకాయిలను రైట్ ఆఫ్ (రద్దు) చేసినట్లు లోక్ సభలో ఆర్థిక మంత్రి ప్రకటించారు.?
జ : 14.56 లక్షల కోట్లు

6) కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు.?
జ : సంజయ్ కుమార్

7) కేంద్ర ప్రభుత్వ రుణాలు 2023 మార్చి – 31 నాటికి జిడిపిలో ఎంత శాతం ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.?
జ : 57.1% (2014 లో 52.2%)

8) కేంద్ర లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర రైతుల తలసరి రుణభారం ఎంత.?
జ : 1,52,665

9) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన ఛీప్ సెలెక్టర్ గా ఎవరిని నియమించింది.?
జ : ఇంజమామ్ ఉల్ హక్

10) దేశ పౌరుల ప్రైవసీ పరిరక్షణ కోసం లోక్ సభ ఆమోదించిన బిల్లు పేరు ఏమిటి.?
జ : డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు – 2023

11) నేతన్న బీమా పథకం ప్రస్తుతం 59 సంవత్సరాల వయసు వరకు ఉన్నవారు మాత్రమే అర్హులు‌, ఇప్పుడు ఈ వయసును ఎంతవరకు పెంచారు.?
జ : 75 సంవత్సరాలు

12) తెలంగాణలో నేతన్నలకు గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనున్న పథకం పేరు ఏమిటి.?
జ : తెలంగాణ చేనేత మగ్గం

13) దేశంలో కోటికి పైగా ఆదాయం ఉన్నవారి సంఖ్య ఎంతగా ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.?
జ : 1.69 లక్షల మంది

14) సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు చీఫ్ కోచ్ గా ఎవరిని నియమించుకుంది.?
జ : డేనియల్ వెటోరి

15) మణిపూర్ ఘటనాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పరిశీలన కమిటీలో సభ్యులుగా ఉన్నవారు ఎవరు.?
జ : శాలిని జోషి, గీతా మిట్టల్, ఆశా మీనన్

16) తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న నియోజకవర్గం ఏది?
జ : శేరిలింగంపల్లి