DAILY CURRENT AFFAIRS IN TELUGU 3rd JULY 2023

1) యునెస్కో నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ను భూమి మీద ఉత్పత్తి చేస్తున్నారు.?
జ : 43 కోట్ల మెట్రిక్ టన్నులు

2) వింబుల్డన్ 2023 ఆరంభ ఉత్సవాల సందర్భంగా భారత్కు చెందిన ఏ క్రీడ ఛాయాచిత్రాన్ని ప్రదర్శించారు.?
జ : కేరళ స్నేక్ బోట్

3) శాప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ను భారత్ ఎన్ని సార్లు గెలుచుకుంది.?
జ : 8సార్లు

4) ఏ బ్యాంకు తాజాగా అన్ని ఏటీఎంలలో క్యాష్ లెస్
నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించింది.?
జ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

5) కేవలం 999 రూపాయలకే 4జి ఫోన్ ను అందించనున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది.?
జ : జియో

6) ఏ అంతర్జాతీయ విమానాశ్రయం 100% సౌర విద్యుత్ ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : రాజీవ్ గాంధీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్

7) చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఏరోజు చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది.?
జ : జూలై 13

8) భారతీయ రైల్వే మొట్టమొదటి ప్రాంతీయ రాపిడెక్స్ రైల్ ఏ స్టేషన్ల మధ్య నడపనుంది.?
జ : సాహిబాబాద్ – దూహై

9) అతిపెద్ద వార్ మెమోరియల్ ను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : తెలంగాణ

10) కోల్ ఇండియా నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పి ఎం ప్రసాద్

11) మహారాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.?
జ : అజిత్ పవార్

12) గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 నివేదికను ఏ సమస్త ప్రకటించింది.?
జ : ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్

13) గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 నివేదికలో 163 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 126

14) ఏ ప్రవాస భారతీయుడు గ్రేట్ ఇమ్మిగ్రేంట్ అవార్డుకు ఎంపికయ్యారు.?
జ : అజయ్ బంగా

★ మరిన్ని వార్తలు