DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th AUGUST 2023
1) పాకిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ హై కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : గీతికా శ్రీవాస్తవ
2) తన సన్‌షైన్ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ యూత్ ఇకో హిరో 2023 పురష్కారం పొందిన భారతీయ బాలిక ఎవరు. ?
జ : మాన్య హర్ష
3) “ఎజెండా – 2063” అనేది ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించిన అంశము.?
జ : ఆఫ్రికా యూనియన్
4) ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో జాతీయ సమగ్రత చిత్రం అవార్డు (నర్గీస్ దత్ అవార్డు) ను ఏ చిత్రం గెలుచుకుంది.?
జ : ది కాశ్మీరీ ఫైల్స్
5) కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజి (మల్కపేట రిజర్వాయర్) కు ఎవరి పేరు ను పెట్టారు.?
జ : చెన్నమనేని రాజేశ్వరరావు
6) ఏ దేశ క్రికెట్ సంఘం మహిళ, పురుష క్రికెటర్లకు సమాన వేతనం చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
7) గాబన్ దేశపు నూతన అధ్యక్షుడిగా ఎవరు సైనిక తిరుగుబాటు ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు గాలి బాంగో ను దింపి ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : జనరల్ బ్రైస్ క్లొటైర్ ఒలిగ్ గుయోమా
8) ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : బంగ్లాదేశ్
9) ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య దేశాల జాబితాలో రెండు, మూడో స్థానలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : ఇండియా, నేపాల్
10) ఎప్పుడు స్థాపించిన లండన్ లోని ఇండియా క్లబ్ ను ఇటీవల ఆర్థిక కారణాలవల్ల మూసివేస్తున్నట్లు ప్రకటించారు.?
జ : 1933
11) ఈ రాష్ట్ర ప్రభుత్వం అయోధ్య లో టెంపుల్ మ్యూజియం నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : ఉత్తరప్రదేశ్
12) ఏ ఐఐటీ సంస్థకు ఆ సంస్థ పూర్వ విద్యార్థి 160 కోట్లు దానం చేశాడు.?
జ : ఐఐటీ బాంబే
13) ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : మధ్యప్రదేశ్
14) ‘The life, Vision and Songs of Kabir’ పుస్తక రచయిత ఎవరు.?
జ : విపుల్ రికీ
15) చెస్ క్రీడాకారుడు ప్రజ్ఞానందా పూర్తి పేరు ఏమిటి.?
జ : రమేష్ బాబు ప్రజ్ఞానందా