DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th NOVEMBER 2023

1) ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్ర క్యాబినెట్ 24,104 కోట్లతో ప్రారంభించనున్న ఏ పథకానికి ఆమోదముద్ర వేసింది.?
జ : జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహ అబియాన్

2) 16వ ఆర్థిక సంఘం సూచనలు, సలహాలు ఎప్పటినుండి అమలు కానున్నాయి.?
జ : 2026 ఏప్రిల్ 01 నుండి

3) కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో తాజాగా కోటి రూపాయలు గెలుచుకున్న 14 ఏళ్ల బాలుడు ఎవరు.?
జ : మయాంక్

4) Sustainable Aeroplane Fuel (SAF) – పర్యావరణహితమైన ఇంధనంతో నడిచిన తొలి విమానంగా ఏ విమానం నిలిచింది.?
జ : బోయింగ్ – 787 డ్రీమ్ లైనర్

5) ఐక్యరాజ్య సమితి ద్వారా COP 28 సదస్సులో ‘గ్రీన్ యూనివర్సిటీ 2023’ అందుకోనున్న తెలంగాణకు చెందిన యూనివర్సిటీ ఏది?
జ : రాజీవ్ గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక యూనివర్సిటీ – బాసర

6) దేశంలో తొలిసారిగా ఒక గవర్నర్ కు ఏడీసీ “ఎయిడ్ ది క్యాంపు” గా ఒక మహిళ ఉద్యోగిని మిజోరం గవర్నర్ నియమించారు. ఆమె పేరు ఏమిటి.?
జ : మనీషా ఫాడీ

7) వాయు కాలుష్యం వలన భారత్ లో సంవత్సరానికి ఎంత మంది చనిపోతున్నారని జర్మనీ పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడించింది.?
జ : 21.8 లక్షలు

8) దక్షిణాసియాలో తొలి స్వలింగ వివాహాన్ని అధికారికంగా చేసిన దేశం ఏది .?
జ : నేపాల్

9) ప్రాన్స్ అత్యున్నత పౌర గౌరవ పురస్కారం పొందిన ఇస్రో శాస్త్రవేత్త ఎవరు.?
జ : లలితాంబిక

10) ఏసియన్ కోవిడ్ వారియర్ అవార్డు 2023 అందుకున్న తెలంగాణకు చెందిన వైద్య అత్యవసర సేవల సంస్థ ఏది.?
జ : EMRI (GVK) – 108

11) ఎన్ని తేజస్ తేలికపాటి యుద్ధం విమానాలు కొనుగోలుకు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది.?
జ : 97

12) ఎన్ని తేలికపాటి ప్రపంచ హెలికాప్టర్ ల కొనుగోలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.?
జ :156

13) 2023 లో సగటు ఉష్ణోగ్రత ఎంతమేర పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తెలిపింది.?
జ : 1.4℃